మంత్రి ఫరూక్ కళా సాధన శిక్షణ శిబిరం కరపత్రాలు ఆవిష్కరణ
నంద్యాల: రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ కళారాధన సాంస్కృతిక సంస్థ నిర్వహించే 'కళా సాధన' లలిత కళల వేసవి శిక్షణ శిబిరం కరపత్రాలు, పోస్టర్స్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం 25 సంవత్సరాలుగా ప్రతి ఏటా ఉచితంగా 300 మంది పైగా విద్యార్థులకు నెల రోజులు లలిత కళల శిక్షణ అందిస్తున్నట్లు మంత్రి ఫరూక్ తెలిపారు. కళారాధన అధ్యక్షుడు డాక్టర్ మధుసూదనరావు, ప్రధాన కార్యదర్శి డాక్టర్ రవి కృష్ణ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.మంత్రి ఫరూక్ కళారాధన సంస్థకు అభినందనలు తెలియజేసి, డాక్టర్ రవి కృష్ణను శాలువాతో సత్కరించారు. డాక్టర్ మధుసూదనరావు, డాక్టర్ రవి కృష్ణ తెలిపిన ప్రకారం, శిక్షణ ముగిసిన తర్వాత జూన్ 2న ఎన్టీఆర్ పురపాలక టౌన్ హాల్లో విద్యార్థుల ప్రదర్శనలు మరియు ప్రశంసా పత్రాల పంపిణీ జరుగుతుంది. కార్యక్రమంలో ఐఎంఏ నంద్యాల అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ మహమ్మద్ రఫీ, రాష్ట్ర కమిటీ సభ్యులు మరియు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.