ఆళ్లగడ్డ..టిడ్కో రహదారి గుంతలకు పరిష్కారం
AIMA న్యూస్ నంద్యాల జిల్లా: ఆళ్లగడ్డ పట్టణ శివారులోని కోవెలకుంట్ల రోడ్డుపై ఉన్న టిడ్కో గృహాలకు వెళ్లే ప్రధాన రహదారిలో గుంతల సమస్యకు ఎట్టకేలకు పరిష్కారం లభించింది. గత కాలంగా ఈ రహదారి గుంతలతో నిండిపోయి, ప్రయాణికులకు పెద్ద ఇబ్బంది కలిగిస్తోంది. ముఖ్యంగా రాత్రిపూట వాహనదారులు ప్రమాదాలకు గురవుతారేమోనని భయంతో ఉన్నారు.స్థానిక ప్రజలు, వాహనదారులు ఈ సమస్యను అధికారుల దృష్టికి తీసుకువెళ్లగా, రోడ్డు భవనాల శాఖ అధికారులు సానుకూలంగా స్పందించారు. ఈరోజు ఉదయం యుద్ధ ప్రాతిపదికన రహదారిపై గుంతలను పూడ్చి మరమ్మతులు పూర్తిచేశారు. ఈ చర్యలతో టిడ్కో నివాసితులు మరియు రహదారి ప్రయాణికులు ఊపిరి పీల్చుకుంటున్నారు. స్థానికులు ఈ తక్షణ చర్యలకు కృతజ్ఞతలు తెలుపుతూ, నియోజకవర్గంలోని ఇతర రహదారులపై కూడా అధికారులు దృష్టి పెట్టాలని కోరుతున్నారు.