మినిస్టర్ నాదెండ్ల మనోహర్ తో భేటి అయిన గుమ్మా నాగార్జున
Aima Media News,సాలూరు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు మృతికి సంతాపం తెలియజేయడానికి ఇంతకు ముందు హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో నివాసం ఉంటున్న నాదెండ్ల మనోహర్ ను మన్యం జిల్లా జనసేన పార్టీ ఇన్చార్జ్ ఆదాడ.మోహన్,జనసేన నేత గుమ్మా నాగర్జున కలసి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేసారు.అంతేకాకుండా శుక్రవారం సాయంకాలం మళ్లీ మనోహర్ తో భేటీ అయ్యి తమ జిల్లాలో ఇంకా నియోజకవర్గంలో జనసేన పార్టీ బలోపేత కార్యాచరణ గురించి చర్చించారు. అందులో భాగంగ ఈనెలాఖరున సాలూరు పట్టణ ఐదో వార్డులో జనసేన పార్టీ ఎమ్మెల్యేలు,లీడర్స్ ముఖ్య అతిధులుగా బహిరంగ సభ ఏర్పాటు చేస్తామని ఆయనకు తెలిపారు.దీనికి సానుకూలంగా స్పందించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినందుకు మంత్రి నాదెండ్ల మనోహరకు పత్రికా ముఖంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని స్థానిక విలేకరులకు ఆదాడ. మోహన్ గుమ్మా.నాగర్జున తెలియజేసారు.