విద్యార్థి కి ఘన సన్మానం
పది ఫలితాల్లో 564 మార్కులతో సత్తా చాటిన ఆరేపల్లి.
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం ఆరెపల్లి గ్రామం లోని విద్యార్థి కి ఘన సన్మానం
పది ఫలితాల్లో 564 మార్కులతో సత్తా చాటిన ఆరేపల్లి గ్రామానికి చెందిన చెలుకల చంద్రశేఖర్ రెడ్డి, గ్రామ సర్పంచ్ మరిజ మోహన్ రావు ఆధ్వర్యం లో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా సర్పంచ్ మోహన్ రావు మాట్లాడుతూ చదువుతోనే మంచి భవిష్యతు ఉంటుంది అని అన్నారు విద్య కోసం ప్రతి ఒక్కరికి నా సహాయ సహకారాలు ఉంటాయి అన్నారు. ఈ కార్యక్రమం లో ఉపసర్పంచ్ భూమి రెడ్డి, మాజీ సర్పంచ్ తిరుపతి రెడ్డి , నాయకులు కిషన్ , లచ్చి రెడ్డీ , బుర్ర రాములు, స్వామి చరణ్ గౌడ్ , సురేందర్ రెడ్డి, వెంకట్ రెడ్డి, రవీందర్ రెడ్డి, మల్లయ్య, తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.