ప్రభుత్వ సాంఘిక సంక్షేమ పాఠశాలలో పదో తరగతిలో 100 శాతం ఉత్తీర్ణత
కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల పాఠశాలలో పదవ తరగతి ఫలితాలలో మహిళా విద్యార్థినులు 77 మందికి 77 మంది విద్యార్థినులు 100 శాతం ఉత్తీర్ణత సాధించారు.అందులో బి.లహరిక 600 మార్కులకు గాను 580 మార్కులు, కె.అభీష్ట 600 మార్కులకు 567 మార్కులు సాధించి అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ఉత్తీర్ణత సాధించడం జరిగింది అని ప్రిన్సిపల్ చైతన్య సుధ తెలిపారు. ప్రైవేట్ పాఠశాలకి ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో ఉత్తీర్ణత సాధించడం జరిగిందని తెలిపారు.