ఎమ్మెల్సీ ప్రో.కోదండరాం కి శుభాకాంక్షలు తెలిపిన AHS కాంట్రాక్ ఉద్యోగులు
హైదరాబాద్: ఇటీవల కాలంలో గవర్నర్ కోటలో ఎమ్మెల్సీ పదవిని చేపట్టిన తెలంగాణ ఉద్యమ సారధి, వేలమందికి విద్య బుద్దులు నేర్పిన ఆచార్యుడు, తెలంగాణ జన సమితి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, ప్రో.కోదండరాం గారికి నిమ్స్ అలైడ్ హెల్త్ సైన్స్ (AHS) కాంట్రాక్ట్ ఉద్యోగ నాయకులు కల్సి శుభాకాంక్షలు తెలియజేసారు. శుభాకాంక్షలు తెలియజేసిన వారిలో గద్దర్,జగదీష్,నవీన్,నజీర్ తదితరులు వున్నారు.