logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

*ఖాతాదారులకు ఇబ్బందులు లేకుండా C-KYC ప్రక్రియ వేగవంతం చేయాలి



ఖాతాదారులకు ఇబ్బందులు లేకుండా C-KYC ప్రక్రియ వేగవంతం చేయాలి

* ఖాతాదారులకు అసౌకర్యం లేకుండా సేవలు అందించాలి

* C-KYC ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలి

* ఆదివారం కూడా విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి అభినందనలు

* డీసీసీబీ చైర్మన్ కిమిడి నాగార్జున



ఖాతాదారులకు ఇబ్బందులు లేకుండా సి-కెవైసి ప్రక్రియ చెయ్యాలిని విజయనగరం జిల్లా డీసీసీబీ చైర్మన్ కిమిడి నాగార్జున అన్నారు.
సాలూరు డీసీసీబీ బ్రాంచ్‌ను ఆదివారం ఆకస్మికంగా సందర్శించి, బ్యాంకులో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ, ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం ప్రతి ఖాతాదారు తప్పనిసరిగా సి -కెవైసి ప్రక్రియను పూర్తి చేసుకోవాల్సి ఉందని పేర్కొన్నారు. అయితే కొంతమంది ఖాతాదారులు ఇంకా ఈ ప్రక్రియలో వెనుకబడి ఉండటం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో శనివారం, ఆదివారం సెలవు రోజుల్లో కూడా ప్రత్యేకంగా సేవలు అందించేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు.
బ్యాంకులో జరుగుతున్న సి-కె వైసి ప్రక్రియను స్వయంగా పరిశీలించిన చైర్మన్, ఖాతాదారులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సౌకర్యవంతమైన వాతావరణంలో సేవలు అందించాలని అధికారులకు సూచించారు. ప్రతి ఖాతాదారుని చేరుకునే విధంగా ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని, రోజువారీ లక్ష్యాలను నిర్దేశించుకుని వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు.
ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన లోపం కారణంగా సి-కెవైసి పూర్తి చేయని ఖాతాదారులు ఎక్కువగా ఉన్నారని, అందువల్ల గ్రామస్థాయిలో ప్రచారం నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఖాతాదారుల సందేహాలను తక్షణమే నివృత్తి చేస్తూ, స్నేహపూర్వక సేవల ద్వారా బ్యాంకుపై నమ్మకాన్ని పెంపొందించాలని పేర్కొన్నారు.
ఆదివారం రోజున కూడా సేవలందిస్తూ బాధ్యతతో పని చేసిన బ్యాంకు సిబ్బంది పనితీరుపై చైర్మన్ సంతృప్తి వ్యక్తం చేసి అభినందించారు.
ఈ కార్యక్రమంలో బ్యాంకు మేనేజర్, సిబ్బంది పాల్గొన్నారు.

107
2951 views

Comment