వివో ఏలు ప్రభుత్వం పైన ఎటువంటి ధర్నా నిరసన కార్యక్రమాలు చేయవద్దు వివోఏ యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షులు ప్రభుదాస్
*వివోఏ లు ఎటువంటి ధర్నా నిరసన కార్యక్రమాలు చేయొద్దు. వివోఎ ల యూనియన్ వ్యవస్థాపకులు ప్రభుదాస్*.
ఏపీ వెలుగు వి ఓ ఏ ల యూనియన్ ( స్వతంత్ర ) వ్యవస్థాపకులు ప్రభుదాస్ మాట్లాడుతూ డి ఆర్ డి ఏ -వెలుగు ప్రాజెక్ట్ లో పనిచేస్తున్నటువంటి వి ఓ ఏ లు ఎటువంటి ధర్నా, నిరసన కార్యక్రమాలు నిర్వహించడం లేదని, ఎవ్వరు కూడా పాల్గొనడం లేదని, కొన్ని యూనియన్ లు పనిగట్టుకొని మా VOA ల వ్యవస్థ పై బురదజల్లి, వారి పబ్బం గడుపుకొని, కనుమరుగవుతున్న వారియొక్క యూనియన్ ఉనికిని కాపాడుకోవడానికి VOA లను అడ్డుపెట్టుకొని లేనిపోని పనులు చేస్తూ..
ప్రభుత్వ మరియు ప్రాజెక్ట్ కు వ్యతిరేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రభుత్వం దృష్టిలో మన వ్యవస్థ మీద వ్యతిరేకత వచ్చే విధంగా చేస్తూ రాక్షశానందం పొందడానికి చూస్తున్నారని, ఎటువంటి కార్యక్రమాలను మా స్వతంత్ర యూనియన్ చూస్తూ ఊరుకోదని, వారికి తగిన గుణపాఠం చెబుతామని VOA లకు నష్టం వాటిల్లే విధంగా ఏ యూనియన్ పాల్పడిన సహించే ప్రసక్తే లేదని,
మనకు ప్రభుత్వం మరియు ప్రాజెక్ట్ అన్ని విధాలుగా VOA ల సమస్యలను అంచెలంచలుగా పరిహారిస్తూ వస్తోందని, అటునంటి తరుణం లో మాకు ధర్నాలు చేయాల్సిన అవసరమే మాకు లేదని ఏ సమస్య అయినా ఉన్నా కూడా సామరస్యంగా ప్రభుత్వం మరియు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకుంటామని ఒకవేళ ఎవరైనా వివోఏలు ధర్నా కార్యక్రమంలో పాల్గొంటే ఖచ్చితంగా వారు వివోఏ లు అయి ఉండరని,ఎందుకంటే ఈ విషయం మీద మా యూనియన్ ప్రత్యేక దృష్టి సారిస్తుందని అనవసరమైన కార్యక్రమాలు చేసి మా వివో ఏ వ్యవస్థకు చెడ్డ పేరు తెచ్చే విధంగా చేస్తే సంబంధిత వివో ఏ ల మీద కూడా మా యూనియన్ ప్రత్యేక దృష్టిసారించి చర్యలు తీసుకోవడానికి కూడా వెనకాడబోమని...
రేపు సోమవారం అన్ని జిల్లాల కలెక్టర్ ఆఫీసు ముందు కొన్ని యూనియన్ లు తలపెట్టిన అనవసరమైన ధర్నా కార్యక్రమంలో ఎవ్వరు కూడా VOA లు పాల్గొనద్దని, పాల్గొనాల్సిన అవసరం మనకు లేదని అసలు ఎందుకు ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నారో వారికే తెలియదని దయచేసి ఈ విషయాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి వివోఏ మిత్రులు అందరు కూడా గ్రహించి ఏదైనా సమస్య ఉన్నా కూడా మా స్వతంత్ర వి ఓ ఏ ల యూనియన్ దృష్టికి తీసుకువచ్చి, పరిష్కరించుకునే విధంగా మనం ముందుకు వెళ్దామని ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది..