ఆర్.ఓ ప్లాంట్ ను ప్రారంభించిన శాంతిరాం విద్యాసంస్థల ఎండీ మిద్దె శివరాం.
పాణ్యం (AIMA MEDIA): పాణ్యం మండలం కౌలూరు గ్రామంలో, (RO.ప్లాంట్)ను,శుద్ధ నీటి జలాన్ని ప్రారంభించిన శాంతిరాం విద్యాసంస్థల ఎండీ మిద్దె శివరాం. గ్రామీణ ప్రజలకు శుద్ధ జలం అందుబాటులో ఉండేలా మినరల్ వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నట్లు ఆర్జిఎం ఇంజనీరింగ్ కళాశాల ఎండి మిద్దె శివరాం పేర్కొన్నారు. గురువారం కవులూరు గ్రామంలో రూ 10 లక్షలతో నిర్మించిన ఆర్ జి యం మినరల్ వాటర్ ప్లాంట్ ను ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలోని ప్రజలకు స్వచ్ఛమైన నీటిని అందించాలని ధ్యేయంతో మినరల్ వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు ఇప్పటికే నంద్యాల జిల్లాలోని పలు గ్రామాలలో మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసి గ్రామీణ ప్రజలకు తాగునీరు ఉచితంగా అంద చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ప్లాంటు నిర్మాణానికి స్థలం కేటాయించిన అంబేద్కర్ సేవా సమితి నాయకులు ఆయన అభినందించారు. ఆర్జియం విద్యాసంస్థల ఆధ్వర్యంలో ఇప్పటికే పలు సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు భాస్కర్ రెడ్డి,ఎంపీటీసీ సభ్యులు, అయ్యపు రెడ్డి,విద్యార్ధి జేఏసీ చైర్మన్ రాజు నాయుడు, నంద్యాల.నెరవాడ.భూపాల్ రెడ్డి మాజీ సర్పంచ్. గ్రామ ప్రజలు పాల్గొన్నారు.