logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ఐకెపి,ప్యాక్స్ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణా రావు గారు

కోరుట్ల ఏప్రిల్ 23(ప్రతినిధి అల్లం రాజేష్)

దళారులను నమ్మి రైతులు మోసపోవద్దు
- కాంగ్రెస్ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు గారు

జగిత్యాల జిల్లా
కోరుట్ల మండలం వెంకటాపూర్ గ్రామంలో పాక్స్, ఐకెపి ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రాలను కాంగ్రెస్ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణా రావు, కోరుట్ల మార్కెట్ కమిటీ చైర్మన్ పన్నాల అంజిరెడ్డి గ్రామ సర్పంచ్ ధ్యాగ గంగాధర్ లు కలిసి ప్రారంభించడం జరిగింది.. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు జువ్వాడి కృష్ణారావు మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం పాలనలో దేశానికి అన్నం పెడుతున్న రైతుల సంక్షేమమే పరమావధిగా పాలన కొనసాగిస్తున్నామని అన్నారు.. నాడు బిఆర్ఎస్ పాలనలో కటింగ్ మరియు తాలు మరియు తప్ప పేరుతో రైతులు చాలా వరకు అష్ట కష్టాలు పడ్డారని, మోసపోయారని కానీ ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో సంతోషంగా ఉన్నారని, సన్న వడ్ల కు బోనస్ పొందుతున్నారని అన్నారు.. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు,కోరుట్ల మార్కెట్ కమిటీ చైర్మన్ పన్నాల అంజి రెడ్డి గ్రామ సర్పంచ్ ధ్యాగ గంగాధర్,ఉప సర్పంచ్ పిట్టల రాజేశ్వరి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కొంతం రాజం, మాజీ గ్రామ శాఖ కాంగ్రెస్ అధ్యక్షులు చిట్టి బాబు, కోరుట్ల నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు ఏలేటి మహిపాల్ రెడ్డి, శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ చైర్మన్ కటుకం రాజేష్ నేత మాజీ ఎంపీటీసీ బర్కం నర్సయ్య, మాజీ ఉప సర్పంచ్ విఠల్ రవీందర్ రెడ్డి, పల్లపు అశోక్, ధర్మారం సర్పంచ్ రంజిత్ రెడ్డి , వార్డు మెంబర్ బర్కం బక్కన్న, రైతులు బర్కం రాజేందర్, రహీం భాయ్ ,బలుసు రాజేందర్,ముహమ్మద్ నసీర్,సుమన్ అయిలాపూర్, ఐకెపి మరియు ప్యాక్స్ సిబ్బంది పాల్గొన్నారు...

6
654 views

Comment