logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

రాజుపాలెం గ్రామంలో 50 మందికి పైగా పోలీసు సిబ్బందితో కలిసి కాటన్ సెర్చ్

*కొడవలూరు మండలం నార్త్ రాజుపాలెం గ్రామంలో నెల్లూరు జిల్లా సూపర్నెంట్ ఆఫ్ పోలీస్ డాక్టర్ అజిత వేజెండ్ల గారి ఆదేశాల మేరకు సుమారు 50 మందికి పైగా పోలీసు సిబ్బందితో కలిసి కాటన్ సెర్చ్ నిర్వహించిన కొడవలూరు మండల సిఐ దుర్గాప్రసాద్ గారికి ఎస్ఐ కోటిరెడ్డి గారికి మరియు వారితో కలిసి కాటన్ సెర్చ్ లో పాల్గొన్న బుచ్చి సిఐ శ్రీనివాసరావు గారికి కోవూరు సీఐ సుధాకర్ రెడ్డి గార్లకు విడవలూరు ఎస్సై నరేష్ , బుచ్చి ఎస్సై సంతోష్ రెడ్డి, ఇందుకూరుపేట ఎస్సై నాగార్జున రెడ్డి గార్లకు ఇంకా అనేకమంది పోలీసు యంత్రాంగానికి ప్రత్యేక ధన్యవాదాలు* 🙏🙏🙏

*అనుమానాస్పద వ్యక్తులు, ఇతర మాదక ద్రవ్యాలు ఎవరైనా ఉపయోగించి వాటి వలన యువత జీవితం నాశనం చేసుకుని చుట్టుపక్కల ప్రజలను భయభ్రాంతులను చేస్తూ... అనేక హత్యలు , ఇవిటీజింగ్, ఇంకా చెడు వ్యసనాలకు బానిసలు అయ్యే యువతను మంచి మార్గంలో నడిపించేందుకు ఇది ఒక మంచి కార్యక్రమం.*

*ఇటువంటి కార్యక్రమాలు చేయడం వలన ప్రజలలో పోలీసులుగా మేము ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా కల్పిస్తున్నట్లు వారికి తెలియజేయడం, ఎల్లప్పుడూ ఫ్రెండ్లీ పోలీస్ గా వారి యొక్క మంచి చెడులు తెలుసుకునే అవకాశం ఉంటుంది.*

*అలాగే ఏదైనా చెడు వ్యసనాలకు పిల్లలు బానిసలు అయితే వారి తల్లిదండ్రులే పోలీసులకు సమాచారం ఇచ్చే విధంగా సమాజం తయారు అవుతుంది*

* *ఇంకా ప్రయాణం చేసేటప్పుడు ప్రతి ఒక్కరూ తీసుకోవలసిన జాగ్రత్తలు మరియు తక్కువ ధరలకు వస్తున్నాయి అని కాగితాలు సరిగ్గా లేని బండ్లు కొని వాటి వలన ప్రజలు జైలు పాలు కాకుండా అవగాహన కూడా కల్పించేల చాలా మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారు*

*యాక్సిడెంట్ అనుకోకుండా జరిగినప్పుడు బాధితుడుని ఎవరైనా వెంటనే హాస్పిటల్ కు చేరవేసే ప్రాణాలు కాపాడే ప్రక్రియ ప్రజలకు తెలియజేస్తూ అనేకమంది ప్రాణాలు కాపాడేందుకు యువతకు ఒక మంచి సందేశం ఇచ్చిన పోలీసు యంత్రాంగానికి మరొకసారి ప్రత్యేక కర్టన్ సెర్చ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్న పోలీసు వారికి పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుకుంటూ...*


*మీ బండి కిరణ్ కుమార్* తెలుగుదేశం పార్టీ నాయకులు నార్త్ రాజుపాలెం
కోవూరు నియోజకవర్గం

0
12 views

Comment