రుద్రవరంలో శ్రీ ఎల్లమ్మ దేవత దేవర కార్యక్రమం ఐదవ రోజు 24-04-2026 శుక్రవారం కి వాయిదా.
నంద్యాల జిల్లా రుద్రవరం మండల కేంద్రంలోని పొలిమేర లో వెలసిన శ్రీ ఎల్లమ్మ దేవత కు దేవరలో బాగంగా 3వ రోజు అమ్మవారి సన్నిధిలో ఎల్లమ్మను మట్టితో చేసి దేవర నిర్వహించుటకు అన్ని ఏర్పాట్లు చేయటం జరిగింది, ఈ రోజు సాయంత్రం నిర్వహించాల్సిన కార్యక్రమం ఈనెల 24న అనగా శుక్రవారం సాయంత్రం నుంచి అమ్మవారికి పొలిమేర రెడ్డి కమతం తాటిరెడ్డి రామచంద్రారెడ్డి )ఇంటి నుంచి గ్రామోత్సవంగా బోనం కుండను తీసుకుని వెళ్ళి అక్కడే బోనం వండి అమ్మవారికి సమర్పించి అనంతరం దున్నపోతు పై అసాధు వారు కథ చెప్పిన తరువాత బలి ప్రధానం చేసిన తర్వాత అమ్మవారిని రంగాపురం బావి వద్దకు అమ్మవారిని తీసుకునివెళ్ళి వదిలిపెట్టడం వంటి కార్యక్రమాలు బుధవారం మధ్య రాత్రి సమయంలో జరుగుతుందనీ,కానీ ఈ కార్యక్రమం అకాల వర్షాలకి ఐదవ రోజు అనగా 24-04-2026 శుక్రవారం నాటికి వాయిదా వేయడం జరిగిందని, కావున ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని గ్రహించి శుక్రవారం నాడు జరగబోవు ఎల్లమ్మ దేవర కార్యక్రమానికి భక్తులు ప్రజలు తరలివచ్చి అమ్మవారి అనుగ్రహానికి పాత్రులు కావాలని,ఎల్లమ్మ ఆనుగ్రహం పొందాలని గ్రామ పెద్దలు కోరుతున్నారు.