రుద్రవరంలో మూడవ రోజు పొలిమేరలో వెలసిన ఎల్లమ్మ దేవతకు దేవర.
నంద్యాల జిల్లా రుద్రవరం మండల కేంద్రంలోని పొలిమేర లో వెలసిన శ్రీ ఎల్లమ్మ దేవత కు దేవరలో బాగంగా 3వ రోజు అమ్మవారి సన్నిధిలో ఎల్లమ్మను మట్టితో చేసి దేవర నిర్వహించుటకు అన్ని ఏర్పాట్లు చేయటం జరిగింది ఈ రోజు సాయంత్రం నుంచి అమ్మవారికి పొలిమేర రెడ్డి కమతం తాటిరెడ్డి రామచంద్రారెడ్డి )ఇంటి నుంచి గ్రామోత్సవంగా బోనం కుండను తీసుకుని వెళ్ళి అక్కడే బోనం వండి అమ్మవారికి సమర్పించి అనంతరం దున్నపోతు పై అసాధు వారు కథ చెప్పిన తరువాత బలి ప్రధానం చేసిన తర్వాత అమ్మవారిని రంగాపురం బావి వద్దకు అమ్మవారిని తీసుకునివెళ్ళి వదిలిపెట్టడం వంటి కార్యక్రమాలు బుధవారం మధ్య రాత్రి సమయంలో జరుగుతుంది.కావున ప్రతి ఒక్కరు అమ్మవారి పాత్రులు కావాలని,ఎల్లమ్మ ఆనుగ్రహం పొందాలని గ్రామ పెద్దలు కోరుతున్నారు.