logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ఎమ్మిగనూరు కో ఆపరేటివ్ స్టోర్స్ దుకాణాల నిర్మాణం

_*ఎమ్మిగనూరు కోఆపరేటివ్ స్టోర్స్ ఆధ్వర్యంలో దుకాణాల నిర్మాణానికి భూమి పూజలో ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి గారు పాల్గొన్నారు.ఎమ్మిగనూరు కోఆపరేటివ్ స్టోర్స్ లిమిటెడ్ ఆధ్వర్యంలో నూతన దుకాణాల నిర్మాణానికి నిర్వహించిన భూమి పూజ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ బీ.వీ. జయ నాగేశ్వర్ రెడ్డి గారు పాల్గొన్నారు.*ఈ సందర్భంగా కోఆపరేటివ్ స్టోర్స్ చైర్మన్, డైరెక్టర్లు, ఇన్‌చార్జ్ కార్యదర్శి, ఏఎంసీ చైర్మన్ మరియు టీడీపీ కమిటీ సభ్యులతో కలిసి భూమి పూజ నిర్వహించారు. పట్టణ అభివృద్ధిలో భాగంగా ఈ దుకాణాల నిర్మాణం చేపడుతున్నామని, కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తోందని ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి గారు తెలిపారు.ఈ కార్యక్రమంలో కోఆపరేటివ్ స్టోర్స్ చైర్మన్ గట్టు అల్తాఫ్, డైరెక్టర్లు బోయ రాఘవేంద్ర, వడ్డే రవి చంద్ర, కుమ్మరి లక్ష్మన్న, పర్సన్ ఇన్‌చార్జ్ ఎం. రామరాజు, మార్కెట్ కమిటీ చైర్మన్ కురువ మల్లయ్య, టీడీపీ పట్టణ కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.*_

4
1270 views

Comment