logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

"అక్షయ తృతీయ వేళ.. 'అక్షయం'గా సాగుతున్న శారదామృత సేవా యజ్ఞం!"

మారుటేరు, ఏప్రిల్ 20: అక్షయ తృతీయ పర్వదినాన్ని పురస్కరించుకుని శారదామృత సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలను ఈ రోజు ఉదయం నుండి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ట్రస్ట్ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ డాక్టర్ వి. సత్యహరి గారి పర్యవేక్షణలో మారుటేరు మరియు పరిసర ప్రాంతాలలో ఉన్న పేదలకు మరియు దివ్యాంగులకు అన్నప్రసాద వితరణ చేపట్టారు.
ఈ సందర్భంగా మహిళలకు వస్త్రదానం (చీరల పంపిణీ) చేయగా, గోవులకు కూరగాయలను ప్రత్యేక ఆహారంగా అందించారు. కార్యక్రమంలో పాల్గొన్న ఆశ్రిత వర్గాల ముఖాల్లో చిరునవ్వులు చూసి నిర్వాహకులు తృప్తి చెందారు.
ఈ సందర్భంగా ట్రస్ట్ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ డాక్టర్ వి. సత్యహరి మాట్లాడుతూ, "ప్రతి మనిషిలోనూ మన ఇష్ట దైవాన్ని చూస్తూ సేవ చేయడమే మా ట్రస్ట్ ప్రధాన లక్ష్యం. సమాజంలోని అభాగ్యులకు అండగా నిలవడమే మేము చేస్తున్న చిన్న ప్రయత్నం. ఈ సేవలో భాగస్వాములైన దాతలందరికీ పేరుపేరునా మా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. దాతల సహకారం ఇలాగే కొనసాగితే, భవిష్యత్తులో మరింత మందికి, పూర్తి నిబద్ధతతో నిరంతరాయంగా సేవలను విస్తరిస్తాము" అని తెలిపారు.

0
0 views

Comment