ఆయిల్ స్మగ్లింకు పాల్పడుతున్న అంతరాష్ట్ర ముఠా ను అరెస్టు
వరంగల్ :
*హష్ ఆయిల్ స్మగ్లింకు పాల్పడుతున్న అంతరాష్ట్ర ముఠా ను అరెస్టు చేసిన చేసిన వరంగల్ పోలీసులు*
*కోట్ల విలువగల హషిష్ ఆయిల్ స్వాధీనం*
*వరంగల్ కమిషనరేట్ పరిధిలో భారీ స్థాయిలో పట్టుబడిన హష్ ఆయిల్.*
వరంగల్ డ్రగ్ కంట్రోల్, క్యాట్ పార్టీ ఇంతేజార్ గంజ్ పోలీసులు సంయుక్తంగా కలిసి అరెస్ట్ చేశారు
ఈ ముఠా నుండి 2కోట్ల 50లక్షల విలువగల హష్ ఆయిల్ స్వాధీనం చేసుకున్న పోలీసులు.
నలుగురు నిందితులు అరెస్ట్,పరారిలో మరో నిందితుడు
నలుగురు ఒడిస్సా రాష్ట్రానికి చెందిన వారు కాగా మరొకరు ఆంధ్రప్రదేశ్ చెందిన నిందితుడు.
నిందితుల నుండి రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు.
వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ మీడియాకు వివరాలను వెల్లడిస్తూ...
ప్రధాన నిందితుడు హంటల్ సన్ను తన స్వగ్రామంలో గంజాయి మొక్కలను పెంచుతూ
మిగతా నిందితుల ద్వారా గంజాయి అమ్ముతూ సొమ్ము చేసుకొని జల్సాలకు పాల్పడేవారు ..
గంజాయి అమ్మిన వచ్చిన డబ్బులు జల్సాలకు సరిపోకపోవడంతో..
ప్రధాన నిందితుడు గంజాయి నుండి హష్ ఆయిల్ తయారు చేసే మరో నిందితుడు పాండు తీసుకువచ్చిన పరికరంతో
పాండు ఇచ్చిన సలహాతో గంజాయి మొక్కల ద్వారా 40కిలోల హష్ ఆయిల్ ను సేకరించారు.
20కిలోల హష్ ఆయిల్ పాండు తీసుకెళ్లగా..
మిగతా 20కిలోలు కేజీ చొప్పున ప్యాకెట్లలో భద్రపరిచారు.
నిందితులు 5కిలోల చొప్పున తీసుకొని ఆంధ్రప్రదేశ్ లోని తుని రైల్వే స్టేషన్ నుండి కోణార్క్ రైలులో బయలుదేరారు.
వరంగల్ రైల్వే స్టేషన్లో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారని ముఠా సభ్యులకు అనుమానం రావడంతో
ముఠా సభ్యులు ముంబై వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో
వరంగల్ బస్టాండ్, ఆటో స్టాండ్ పరిసరాల్లో అనుమానస్పదంగా తిరుగుతున్నట్లుగా పోలీసులకు సమాచారం రావడంతో
నిందితులను అదుపులోకి తీసుకొని తనిఖీలు చేయగా వారి వద్ద హష్ ఆయిల్ గుర్తించి
వారి వద్ద 20కిలోల హష్ ఆయిల్ స్వాధీనం చేసుకొని నిందితులను అరెస్ట్ చేశారు.
నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన పోలీసులను సిపి అభినందించారు.