logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

చిన్న పిల్లల ఆనందము, జీవితంలో మరుగులేని సంతోషం 🙏🙏

🙏🙏శుభోదయం సార్,
ఈ రోజు హరినగరం, రుద్రవరం మండలం, నంద్యాల జిల్లా,
ప్రాధమిక పాఠశాల లో 52 మందికి విద్యార్థిని, విద్యార్థులకు, డా.సి.గంగన్న, అద్యాపకులు ,సమాజ సేవకులు చెప్పులు పంపిణి చేయడం జరిగినది. గంగన్న మాట్లాడుతూ, 20/4/2026 తేదీన బడిబాట కార్యక్రమము లో విద్యార్థులు ర్యాలీ వెళ్లుచున్న సమయం లో,
ఎవరికి చెప్పులు లేవు, నాకు కొంచెము బాద కలిగింది. వెంటనే
మా భార్యకు తెలియచేసినాను. మీరు సమాజ సేవకులు కదా, అందులో ఈ సంవత్సరము ఎండలు ఎక్కువ గా ఉన్నాయి , అందులో పల్లెటూరు లో పేద విద్యార్థులు ఎక్కువ ఉంటారు అని చెప్పినారు. నేను ఏ సేవా కార్యక్రమాలు నిర్వహించిన మా భార్య పూర్తి మద్దతు ఇస్తున్నారు. ఏ పనిచేస్తున్నా ఓ స్త్రీ వుంటుందని అంటారు, నా వెనుక మా భార్య వుంది అని గర్వంగా చెప్పుతున్నాను. ముఖ్యంగా చదువుకునే రోజులలో మేము కూడ పేద వాళ్లమే, ఆ రోజులలో డబ్బులు లేక నన్ను కూడ స్నేహితులు చదివించారు, అది ఇప్పటికీ మరిచి పోలేదు. తల్లిదండ్రుల లేని పిల్లలు వుంటే వారికి ఆర్థికంగా భరోస ఇస్తు నేనే జీవితాంతం చదిసాను అని చెప్పడం జరిగింది . ఈ కార్య క్రమములో MEO 2 లక్ష్మిదేవి, ప్రధానోపాధ్యాయులు jercy , ఉపాధ్యాయులు, ,జాన్సన్ మల్లిశరి [malleswary] పాల్గొన్నారు.

1
467 views

Comment