logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

కష్టకాలంలో ఆపన్నహస్తం. చాగలమర్రిలో 17 కుటుంబాలకు (CMRF) చేయూత.

AIMA న్యూస్ నంద్యాల జిల్లా. ఆపదలో ఉన్న ప్రతి పేదవాడికి అండగా నిలవడమే తమ ప్రభుత్వ ధ్యేయమని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ పేర్కొన్నారు. ఆళ్లగడ్డ నియోజకవర్గ చాగలమర్రి మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో సోమవారం నాడు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 17 బాధిత కుటుంబాలకు మంజూరైన రూ. 9,57,400 విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) చెక్కులను ఆమె పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బాధితుల వినతులపై మానవీయ కోణంలో స్పందించి, ఈ నిధులను మంజూరు చేశారు. గతంలో సహాయం కోసం ఏళ్ల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఉండేది, కానీ నేడు పారదర్శకంగా, కూటమి ప్రభుత్వంలో అర్హులందరికీ సహాయం అందుతోంది. నియోజకవర్గంలోని ప్రతి పేద కుటుంబానికి కష్టం వస్తే అండగా ఉండటమే మా లక్ష్యం. ముఖ్యంగా వైద్య ఖర్చుల కోసం ఇబ్బంది పడే వారికి ఈ నిధి ఎంతో ఊరటనిస్తుంది. ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం శ్రమిస్తాం. అని అన్నారు.తమ కష్టకాలంలో ఎమ్మెల్యే ప్రత్యేక చొరవ తీసుకుని, ముఖ్యమంత్రి సహాయ నిధి అందేలా కృషి చేయడం పట్ల లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి మరియు ఎమ్మెల్యే అఖిల ప్రియకి కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు మరియు పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

13
569 views

Comment