రాష్ట్రస్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రభంజనం
.. కొత్తగూడెం జిల్లా ప్రభంజనం – ‘'మాస్టర్స్ టీమ్ ఛాంపియన్‌షిప్’ కైవసం"
హైదరాబాద్, 20.04.2026
రాష్ట్రస్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలు హైదరాబాద్‌లోని సనత్ నగర్‌లో ఈ నెల 18, 19 తేదీలలో మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లా అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా క్రీడాకారులు అద్భుత ప్రదర్శన కనబరిచారు. జిల్లా జట్టు 'మాస్టర్స్ టీమ్ ఛాంపియన్‌షిప్' ట్రోఫీని కైవసం చేసుకున్నట్లు జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి జి.వి. రామిరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
విజేతల వివరాలు:
మహిళల విభాగం: డి. మేఘనా చౌదరి (69 కేజీలు - కాంస్యం), మామిడి భూమిక (76 కేజీలు - కాంస్యం),
సబ్ జూనియర్ & జూనియర్: ఎండి యాసిన్ (59 కేజీలు - కాంస్యం), మోడల్ వంశీ (66 కేజీలు - స్వర్ణం).
మాస్టర్స్-1: పి. రాజేష్ (83 కేజీలు - స్వర్ణం), బట్టు శ్రీను, బి. సామ్రాట్, జి. దివాకర్ (రజత పతకాలు), మోతిలాల్ (105 కేజీలు - కాంస్యం).
మాస్టర్స్-2: కొమరెల్లి రవీందర్ రెడ్డి (93 కేజీలు - స్వర్ణం), ఎం. రంగారావు (105 కేజీలు - స్వర్ణం). జె. రామకృష్ణ, కె. భవానీ శంకర్, మహంతి వెంకట కృష్ణాజి, బి. కరుణకుమార్ (రజత పతకాలు). బి. శేషు, ఐ. వెంకటేశ్వరరావు (కాంస్య పతకాలు).
మాస్టర్స్-3 & 4: ఎం. వెంకటకృష్ణ, డి.వి. శంకర్రావు, మహమ్మద్ అబ్బాస్ (స్వర్ణ పతకాలు), గొర్రె దుర్గేష్ (రజత పతకం).
ఈ సందర్భంగా విజేతలను తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు వి. మల్లేష్, జిల్లా అసోసియేషన్ అధ్యక్షులు భోగాల శ్రీనివాస్ రెడ్డి, గ్రీన్ భద్రాద్రి సభ్యులు, లయన్స్ క్లబ్, రోటరీ క్లబ్ ప్రతినిధులు మరియు పలువురు రాజకీయ ప్రముఖులు అభినందించారు.