logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

అనంతగిరి: వసతి గృహం మంజూరు చేయాలని వినతి

అనంతగిరి మండల కేంద్రంలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలకు వసతి గృహం నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని జైభారత్ పార్టీ అరకు పార్లమెంట్ అధ్యక్షులు బద్నాయిన చంటిబాబు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం మండల పరిషత్ లో జరిగిన గ్రీవెన్స్ లో ఎంపీడీఓ ప్రభాకరరావు కు వినతి ఇచ్చారు. జూనియర్ కళాశాలకు వసతి లేకపోవడంతో విద్యార్ధులు రూంలు అద్దెకు తీసుకుని ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.

1
0 views

Comment