logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

విధికి బలి అయిన దేవిగ్రంధం (సాజిని).

అమాయకత్వం,అందం అకట్టుకునే రూపము తో ఆమె సినిమా రంగంలోకి ప్రవేశించింది. ఆమె హీరోయిన్ అవ్వాలని కోరుకుంది.

కానీ రాజకీయాల వల్ల చివరికి ఆమె బి-గ్రేడ్ హీరోయిన్‌గా మారిపోయింది.ఆమె పేరు దేవి గ్రాంధం అలియాస్ సాజిని.కేరళలో అందరూ గుర్తించగలరు. ఆమెకు గొప్ప గుర్తింపు ఉంది.ఆమె బి-గ్రేడ్ కళాకారిణి అయినప్పటికీ తన వ్యక్తిత్వాన్ని కోల్పోలేదు.2003లో ఆమె హైదరాబాద్‌కు తిరిగి వచ్చి తన సొంత డబ్బుతో ఒక విల్లా కొనుక్కుంది. ఆమె తన తల్లితో కలిసి నివసిస్తూ ఉండేది.ఆమె అక్క వేరొక పెళ్లి చేసుకోవడం వల్ల, ఆమె కూతుళ్లు అనాథలయ్యారు. దేవి తన సొంత డబ్బుతో వారి పెళ్లిళ్లు చేసింది. తల్లి తండ్రి లేచి పోతే నలుగురు ఆడపిల్లలు అని చేరతీసి కోట్లు పెట్టి పెంచి పెద్ద చేసి ఒక ఇంటి వాళ్ళని చేసి ప్రయోజకుల్ని చేస్తే..డబ్బులు పిచ్చి ఆస్తి పిచ్చి పట్టి పెంచిన మమకారం మర్చిపోయి పిన్ని అని మర్చిపోయి అదే నలుగురు బిడ్డలు వాళ్ళ మొగుళ్ళు దేవి గ్రంధం అలియాస్ సాజినీ గారిని చంపాలని చూస్తున్నారు

ఇటీవల దేవి తల్లి పరమాపదించారు. ఆమె సోదరీమణులు, ఆమె సోదరి భర్త, మేనకోడళ్ళు మొదలైనవారు అంత్యక్రియలకు వచ్చారు.వారు దేవి ఇంటిని ఆక్రమించుకోవడానికి ప్రయత్నించారు. దేవి న్యాయం కోసం పోరాడుతోంది. ఆ తర్వాత ఆమె బంధువులు ఆమెను తీవ్రంగా గాయపరిచారు. కన్ను పోయేలా కొట్టారు. ఎలాగోలా తప్పించుకుని ఆ అబ్బాగ్యురాలు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టడానికి ప్రయత్నించింది.తన కృతజ్ఞత లేని బంధువుల నుండి తనకు ఉన్న ప్రాణహాని గురించి ఆమె వివరించింది. అయితే పోలీసులు కేసు తీసుకోలేదు, పైగా కేసు పెడతామని ఆమెను హెచ్చరించారు. జూబ్లీహిల్స్ ACP గారు చాలా సానుకూలం గా స్పందించి న్యాయం చేస్తాను అని హామీ ఇచ్చారు.ఆమె న్యాయం కోసం పోరాడుతోంది. ఈ న్యాయపోరాటంలో ఆమె గెలవాలని మేము ఆశిస్తున్నాము.

23
10325 views

Comment