మొహమ్మద్ ఘాజీకి తెలంగాణ విశ్వవిద్యాలయ పాలక మండలిలో చోటు | షబ్బీర్ అలీకి కృతజ్ఞతలు
కామారెడ్డి జిల్లా, 19-04-2026
మొహమ్మద్ ఘాజీకి తెలంగాణ విశ్వవిద్యాలయ పాలక మండలి సభ్యునిగా నియామకం – ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ గారికి కృతజ్ఞతలు
తెలిపిన మహమ్మద్ ఘాజీ
హైదరాబాద్, ఏప్రిల్ 19: తెలంగాణ విశ్వవిద్యాలయ పాలక మండలి సభ్యునిగా నియమితులైన మొహమ్మద్ ఘాజీ, తెలంగాణ ప్రభుత్వ బీసీ, ఎస్సీ, ఎస్టీ వ్యవహారాల సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ అలీ గారిని ఆయన నివాసంలో కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
తనపై విశ్వాసం ఉంచి ఈ కీలక బాధ్యతను అప్పగించేందుకు సహకరించిన షబ్బీర్ అలీ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
ఈ అవకాశం తనకు గొప్ప బాధ్యతగా భావిస్తూ, విశ్వవిద్యాలయ అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తానని పేర్కొన్నారు. తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపరచడానికి కృషి చేస్తానని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా షబ్బీర్ అలీ గారు ఘాజీని అభినందిస్తూ, ఆయనకు ఆశీస్సులు అందించారు.
తెలంగాణ విశ్వవిద్యాలయాన్ని జాతీయ స్థాయిలో గుర్తింపు పొందేలా కృషి చేయాలని సూచించారు. విద్యార్థులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి తీసుకురావడంతో పాటు విద్యా వ్యవస్థను పటిష్టం చేసే దిశగా పనిచేయాలని మార్గనిర్దేశం చేశారు.
ఈ కార్యక్రమంలో పలువురు విద్యావేత్తలు మరియు NSUI జిల్లా అధ్యక్షులు ఐరేణి సందీప్ జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు గంప ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.