పాతపట్నం శ్రీశ్రీశ్రీ నీలమణి దుర్గ అమ్మవారికి కుటుంబ సభ్యులతో కలిసి పట్టు వస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే ఎంజీఆర్ గారు
AIMA న్యూస్ శ్రీకాకుళం :
పాతపట్నం శ్రీశ్రీశ్రీ నీలమణి దుర్గ అమ్మవారికి కుటుంబ సభ్యులతో కలిసి పట్టు వస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే ఎంజీఆర్ గారు...
ఉత్కలాంధ్రుళ ఆరాధ్య దైవం శ్రీశ్రీశ్రీ నీలమణి దుర్గ అమ్మవారి ఆలయంలో 51వ వార్షికోత్సవ నవరాత్రి యాత్ర మహోత్సవములు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి.ఈ శరన్నవరాత్రి ఉత్సవాలు తొమ్మిది రోజులు పాటు ఘనంగా జరగనున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు పాతపట్నం శాసనసభ్యులు శ్రీ మామిడి గోవిందరావు గారు కుటుంబ సభ్యులుతో పాల్గొని అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.అనంతరం జ్యోతి ప్రదీపన చేసి ఉత్సవాలు ప్రారంభించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.అనంతరం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు గారు మాట్లాడుతూ అమ్మవారి ఉత్సవాలు ప్రారంభించడం చాలా సంతోషకరమని అన్నారు.ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో టి.వాసుదేవరావు,ఆలయ సిబ్బంది,ఆలయ కమిటీ చైర్మన్ అక్కంద్ర సన్యాసిరావు, తో పాటు ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.