గ్రామ - గ్రామాన విస్తరిస్తున్న "హిందూ సమ్మేళనం"
స్వచ్ఛందంగా తరలి వస్తున్న "భక్త జనం"
గ్రామ - గ్రామాన విస్తరిస్తున్న "హిందూ సమ్మేళనం"
స్వచ్ఛందంగా తరలి వస్తున్న "భక్త జనం"
బుగ్గారం :
జగిత్యాల జిల్లా బుగ్గారం మండలంలోని గ్రామ - గ్రామాన హిందూ సమ్మేళన ప్రచారం విస్తరిస్తోంది. ఆయా గ్రామాలలో స్వచ్ఛందంగా భక్త జనం నిర్వాహకులకు నీరాజనాలు పలుకుతూ తరలి వస్తున్నారు. ఈనెల 22 బుధ వారం సాయంత్రం 4-00 గంటలకు బుగ్గారం మండల కేంద్రంలో "హిందూ సమ్మేళనం" జరుగనుంది. ఇట్టి బృహత్తర కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ సాధు పరిషత్ ఉపాధ్యక్షులు శ్రీ శ్రీ శ్రీ విశ్వాత్మ నందిగిరి స్వామీజీ, ప్రధాన వక్త గా జగిత్యాల జిల్లా ప్రచారక్ ఎలికట్టె మహేందర్ లు హాజరై ప్రసంగించ నున్నారు. ఇట్టి కార్యక్రమ విజయవంతానికై నిర్వాహకులు ప్రచారం నిర్వహిస్తుండగా గ్రామ - గ్రామాన భక్త జనం భక్తి పారవశ్యంతో... నీరాజనాలు పలుకుతున్నారు. మరికొన్ని గ్రామాల ప్రజలు మా ఊరికి ఇంకా ఎప్పుడొస్తారు అంటూ ఎదిరి చూస్తున్నారు. అత్యంత భక్తి పారవశ్యంతో హిందూత్వం పై ఎంతో ప్రేమ - మమకారం చూపిస్తున్నారు. స్వచ్ఛందంగా ఈ కార్యమానికి మేము కూడా సహకరిస్తాం అంటూ వారికి తోచినంత ఆర్థిక సాయం కూడా అందజేస్తున్నారు. మండలంలోని ప్రతి గ్రామం నుండి అధిక సంఖ్యలో హిందూ బంధువులు తరలి వచ్చేందుకు సిద్ధపడుతున్నారు.