logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

విజయానికి మారుపేరు కస్తూర్బా గాంధీ విద్యార్థులు

అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం కస్తూరిబా గాంధీ కళాశాల మరియు పాఠశాల విద్యార్థులు గత కొన్ని సంవత్సరాలుగా విజయ దుందుభి మోగిస్తున్నారు. ప్రిన్సిపల్ తులసి ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల పర్యవేక్షణలో కస్తూరిబా గాంధీ పాఠశాలలో విద్యార్థులు ఎంతో క్రమశిక్షణతో, పట్టుదలతో చదువుతూ జిల్లా స్థాయిలో పాఠశాలకు మరియు కళాశాలకు ప్రతిష్టాత్మక పేరు తీసుకొస్తున్నారు. ఈ విద్యార్థులు క్రమశిక్షణ, శ్రద్ధతో చదివి మండలంలోనే కాక జిల్లా వ్యాప్తంగా కూడా గొప్ప పేరు తెచ్చుకుంటున్నారు.
గత కొన్ని సంవత్సరాలుగా నూటికి నూరు శాతం ఉత్తీర్ణతతో రోలుగుంట మండలంలోని మిగతా అన్ని పాఠశాలలకు దీటుగా శత శాతం ఉత్తీర్ణతతో మండలంలోని ప్రథమ స్థానంలో నిలుస్తున్నారు. మండలంలోని ఇతర పాఠశాలలతో పోల్చితే ఈ పాఠశాల విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించి మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంటున్నారు. ఈ విజయం ప్రతి సంవత్సరం కొనసాగుతూ పాఠశాల ప్రతిష్టను మరింత ఉన్నతం చేస్తోంది.
ప్రిన్సిపల్ తులసి మాట్లాడుతూ విద్యార్థులు ఉపాధ్యాయులు మార్గదర్శకంలో నడుస్తూ వారి యొక్క సూచనలు పాటిస్తూ అత్యున్నత విలువలను చూపిస్తూ ప్రతి సంవత్సరం ఎంతో పట్టుదలతో కష్టపడి పాఠశాల పేరు ప్రఖ్యాతలను ఉన్నత స్థితికి తీసుకెళ్లారని తెలిపారు. అలాగే ఉపాధ్యాయులు పరిపూర్ణత ప్రణాళికతో, ఎంతో శ్రద్ధగా ప్రతి విద్యార్థి అభివృద్ధి తమ లక్ష్యంగా నిరంతరం కష్టపడి విద్యార్థుల మేలుకొరకు పాటుపడుతూ శ్రమిస్తూ ఈ యొక్క పాఠశాల అభ్యున్నతికి తోడ్పడుతున్నారు. ప్రిన్సిపల్ తులసి ఈ విధంగా విద్యార్థులు, ఉపాధ్యాయుల కృషిని ప్రశంసిస్తూ పాఠశాల ఉత్తమ ప్రదర్శనకు కారణాలను వివరించారు.
ఉపాధ్యాయులు మాట్లాడుతూ ప్రిన్సిపల్ తులసి ప్రోత్సాహం, విద్యార్థుల క్రమశిక్షణ వల్లే మా పాఠశాలకు ఎంత మంచి పేరు వచ్చిందని తెలిపారు. ప్రతి సంవత్సరం మంచి ర్యాంకులు సాధించిన విద్యార్థులు మాట్లాడుతూ తమ ప్రిన్సిపల్ అకుంటిత దీక్షతో ప్రతి ఒక్కరిపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ తమ అభివృద్ధికి ఎంతో పాటు పడ్డారని తెలిపారు. అధ్యాపకులు ప్రతి క్షణం విద్యార్థుల గెలుపే తమ లక్ష్యమని, ప్రతి ఒక్కరిపై నిరంతర పర్యవేక్షణ ఉంచి తమకు అన్ని విధాల ఎంతో సహాయ సహకారాలు అందిస్తూ తమ ఉన్నతికి కృషి చేశారని తెలిపారు.
విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ తమ పిల్లలను రోలుగుంట కస్తూరిబా గాంధీ పాఠశాలలో చేర్చిన దగ్గర నుంచి తాము ఎంతో ధైర్యంగా ఉన్నామని, అటువంటి ధైర్యాన్ని భరోసాను, పాఠశాల యాజమాన్యం తమకు కల్పించిందని, తమ విద్యార్థుల బాగోగులు తమకంటే పాఠశాల అధ్యాపకులే నిరంతరం చూసుకున్నారని, ప్రిన్సిపల్ తులసి విద్యార్థులను మలచిన తీరును అభినందిస్తున్నామని తెలిపారు. తల్లిదండ్రులు పాఠశాలలో చేర్చిన తర్వాత పిల్లల అభివృద్ధి చూసి సంతోషంగా ఉన్నామని, ప్రిన్సిపల్ మరియు సిబ్బంది అందించిన మార్గదర్శకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

5
345 views

Comment