మోడీ జి కో హటావో - దేశ్ కి బచావో అంటూ...
కధం తొక్కిన యువజన కాంగ్రెస్...
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిజెపి ఇచ్చిన భిక్ష కాదు తల్లి సోనియా గాంధీ చల్లని చూపు.
డి లిమిటేషన్ బిల్లుపై చర్చ సందర్భంగా బిజెపి ఎంపీ తేజస్వి సూర్య తెలంగాణ ఏర్పాటును ఇండియా పాకిస్తాన్ తో పోల్చడం సిగ్గు చేటూ.
తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ జక్కిడి శివ చరణ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో.
నేడు బిజెపి ప్రభుత్వ నిరంకుశ పాలనకు నిరసనగా...
హైదరాబాద్ ధర్నా చౌక్ ఇందిరా పార్క్ వద్ద మహా ధర్నా నిర్వహించడం జరిగింది..
మోడీ తలవంచితే దేశం తలవంచదు అంటూ.
వేలాదిగా తరలివచ్చిన యువజన కాంగ్రెస్ నాయకులు శ్రేణులు కార్యకర్తలు.
ముఖ్య అతిథులుగా హాజరైన జాతీయ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ ఉదయ్ భాను ఛిబ్ గారు,టిపిసిసి అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు...
మరియు రాష్ట్ర మంత్రి వర్యులు ధనసరి సీతక్క గారు, ఎమ్మెల్సీ విప్ అద్దంకి దయాకర్ గారు మరియు మాజీ ఎంపీ, ఎమ్మెల్యేలు ప్రస్తుత కార్పొరేషన్ చైర్మన్ లు డిసిసి లు.
ఈ సందర్బంగా జాతీయ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు ఉదయ్ భాను ఛిబ్ గారు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గార్లు మాట్లాడుతూ.
యూఎస్ ట్రేడ్ డీల్ చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ.
ప్రస్తుత ట్రేడ్ ఒప్పందాలు దేశ ఆర్థిక వ్యవస్థకు మరియు స్థానిక వ్యాపారులకు నష్టాన్ని కలిగిస్తున్నాయని పేర్కొన్నారు...
మోడీ తలవంచితే దేశం తలవంచదు అంటూ కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్తాయిలో విమర్శలు చేశారు.
ఈ విధమైన ఒప్పందాలు దేశ స్వాభిమానానికి విరుద్ధమని వెంటనే రద్దు చేసి దేశ ప్రయోజనాలను కాపాడాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రవణ్ రావు గారు, రాష్ట ఇంచార్జ్ లు కే. ఆర్ భవ్య గారు, రోష్ని జైస్వాల్ గారు, జాతీయ కార్యదర్శి శ్రీనివాస్ రాథోడ్ గారు మరియు రాష్ట్ర యువజన కాంగ్రెస్ నాయకులు, శ్రేణులు వేలాది సంఖ్య లో పాల్గొన్నారు