logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

పాల్వంచ లిటిల్ ఫ్లవర్ స్కూల్‌లో విద్యార్థుల ఆరోగ్య అవగాహన కార్యక్రమం

Press note
Date:18-4-2026
పాల్వంచ లిటిల్ ఫ్లవర్ స్కూల్‌లో విద్యార్థుల ఆరోగ్య అవగాహన కార్యక్రమం

పాల్వంచలోని లిటిల్ ఫ్లవర్ స్కూల్‌లో IDO సంస్థ విద్యార్థుల ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా రక్తం (Blood) ప్రాముఖ్యత మరియు హీమోగ్లోబిన్ శాతం గురించి విద్యార్థులకు వివరించారు.
రక్తం మన శరీరానికి ఎంతో అవసరమని, ఇది ఆక్సిజన్ మరియు పోషకాలను శరీరమంతా సరఫరా చేస్తుందని తెలిపారు. అలాగే రక్తంలో ఉన్న ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, ప్లేట్లెట్స్ పాత్రలను సులభంగా వివరించారు.
పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే సరైన హీమోగ్లోబిన్ శాతం ఉండటం చాలా ముఖ్యమని, పోషకాహారం తీసుకోవడం, పచ్చి కూరగాయలు, పండ్లు తినడం, శుభ్రత పాటించడం అవసరమని సూచించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొని ఆరోగ్యంపై అవగాహన పెంపొందించుకున్నారు.ప్రిన్సిపాల్ :సునీత
చైర్మన్ :ఎం.కృష్ణ పాల్గోనారు.

0
0 views

Comment