షోకాజ్ నోటీసులను తక్షణమే ఉపసంహరించుకోవాలి: యూటీఎఫ్.
నంద్యాల (AIMA MEDIA): మధ్యాహ్నం భోజన పథకం పై హెడ్మాస్టర్లకు మండల విద్యా శాఖ అధికారులకు డిఈవోలు ఇచ్చిన శోకాజ్ నోటీసులను తక్షణమే ఉపసంహరించుకోవాలని యూటీఎఫ్ నంద్యాల జిల్లా అధ్యక్షుడు పి.వి ప్రసాద్, జిల్లా ప్రధాన కార్యదర్శి జె.సుధాకర్ డిమాండ్ చేశారు.నంద్యాల లోని స్థానిక యుటిఎఫ్ జిల్లా కార్యాలయంలో ప్రాంతీయ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటీవల మధ్యాహ్న భోజనం నాణ్యత పై ఐవీఆర్ఎస్ ద్వారా విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్లు చేసి అభిప్రాయాలు సేకరించారు.విద్యార్థుల తల్లిదండ్రులు ఇచ్చిన సమాధానాలు ఆధారంగా జిల్లాలో 77 మంది హెడ్మాస్టర్లకు 26 మంది మం డల విద్యాశాఖ అధికారులకు షోకాజు నోటీసులు ఇవ్వడాన్ని యుటిఎఫ్ నందికొట్కూరు డివిజన్ కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నది. మధ్యాహ్న భోజనం నాణ్యత ప్రమాణాలు బాగున్నప్పటికీ ఐవీఆర్ఎస్ సిస్టం వినియోగించడంలో అవగాహన లేకపోవడం వల్ల తప్పు ఎంపికలు చేయడం జరిగింది. అలాగే గ్రామీణ ప్రాంతాలలో వంట ఏజెన్సీలకు వ్యతిరేకంగా ఉన్న వర్గాల తల్లిదండ్రులు ప్రతికూల సమాధానాలు నమోదు చేశారు. దీని ఆధారంగా హెడ్మాస్టర్లకు మండల విద్యాశాఖ అధికారులకు నోటీసులు ఇవ్వడం ఎంతవరకు సమంజసం అని వారు ప్రశ్నించారు.ఎక్కడైతే మధ్యా హ్న భోజనం నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదు ఆ ఏజెన్సీల పైన చర్యలు తీసుకోవాలి. బోధ నేతర కార్యక్రమాలతో ఒకవైపు ఉపాధ్యాయులు ఉక్కిరి బి క్కిరి అవుతున్నారు.రెండో వైపున పరీక్షలు జరుగుతు న్నాయి.పేపర్లు దిద్దుతున్నా రు.మార్కులు ఆన్లైన్లో ఎంట ర్ చేయాల్సి ఉంది.నెట్వర్క్ సమస్యలు ఉన్నాయి. పాఠశాలలు వేసవి సెలవులకు దగ్గరలో ఉన్నందువలన రికార్డు వర్క్ తో ఉపాధ్యాయులు సతమతమవుతుంటే ఈ షోకాజు నోటీసుల వలన మరింత ఉపాధ్యాయులు భయాందోళనకు గురవుతున్నారు. కావున తక్షణమే నోటీసులను కోసం యుటిఎఫ్ నంద్యాల శాఖ డిమాండ్ చేస్తున్నది.పాల్గొన్నవారు జిల్లా కార్యదర్శి అరవింద్, ఖాసీం మండల నాయకులు రామదాసు, బాలస్వామి, రామకృష్ణారెడ్డి, సుభాన్ శంకర్ తదితరులు.