logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

బుగ్గారం మండలంలో అధికారులు ప్రోటోకాల్ తప్పుతున్నారు - అధికార పార్టీ నాయకులు కూడా తప్పు చేస్తున్నారు - మా పార్టీకి మేము చెప్పుకుంటామా...?

బుగ్గారం మండలంలో అధికారులు ప్రోటోకాల్ తప్పుతున్నారు


- అధికార పార్టీ నాయకులు కూడా తప్పు చేస్తున్నారు


- మా పార్టీకి మేము చెప్పుకుంటామా...?


- మంత్రి గారి దృష్టికి తీసుకువెళ్తా.....


- మద్దునూర్ తాజా మాజీ సర్పంచ్ "బత్తుల తిరుపతి"


బుగ్గారం :
జగిత్యాల జిల్లా బుగ్గారం మండలంలో అధికారులు ప్రోటోకాల్ తప్పుతున్నారని, మా కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా తప్పు చేస్తున్నారని, ప్రోటోకాల్ వివాదాన్ని మంత్రి గారి దృష్టికి తీసుకు వెళ్తానని మద్దునూర్ తాజా మాజీ సర్పంచ్ బత్తుల తిరుపతి అన్నారు.

శుక్రవారం ఆయన చర్చిస్తూ గురువారం మండల కేంద్రంలో జరిగిన "ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక" మండల స్థాయి సమావేశంలో మండల అధికారులు ప్రోటోకాల్ తప్పారని ఆయన స్పష్టం చేశారు. అలాగే... మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వేముల సుభాష్ అట్టి సమావేశంలో మాట్లాడడం కూడా పొరపాటేనని చెప్పకనే చెప్పుకొచ్చాడు ఆయన.
అంతర్ మండల వాసి ఈ మండల సభలో ప్రసంగించడం పై బత్తుల తిరుపతి సందేహం వ్యక్తం చేశారు.

ఇలాంటి పొరపాట్లు, ఇక ముందు జరగకుండా అధికారులు బాధ్యతగా వ్యవహరించాలని ఆయన సూచించారు.
గురువారం జరిగిన మండల సమావేశంలో పలు శాఖల అధికారులను వేదిక పైకి ఆహ్వానించి కూర్చోబెట్టకుండా అవమాన పర్చడం జరిగిందని అన్నారు. మండల స్థాయి సమావేశంకు అన్ని గ్రామాల ప్రజలను, ప్రజా ప్రతినిధులను రెండు రోజుల ముందు ఆహ్వానించాల్సి ఉండగా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారని ఆయన చెప్పుకొచ్చారు. ప్రోటోకాల్ తప్పిన విషయంలో అందరూ కొచ్చన్ చేయాల్సిందేనని ఆయన అన్నారు. ఇట్టి విషయాలన్నీ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ దృష్టికి తీసుకు వెళ్తానని తెలిపారు.

గురువారం జరిగిన మండల స్థాయి సమావేశంలో ఇదే మండలానికి చెందిన ఓ సామాజిక కార్యకర్త మాట్లాడుతున్న సందర్భంలో తాను అవగాహన లేకుండా అడ్డు తలగడం పొరపాటేనని పచ్చాత్తాప పడుతూ... క్షమాపణ కూడా వేడుకున్నాడు.

6
34 views

Comment