logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

శాంతిభద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు: సీఐ

రాయచోటి: శాంతిభద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు: సీఐ

AP

రాయచోటిలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తప్పవని అర్బన్ సీఐ వెంకటాచలపతి హెచ్చరించారు. డీఎస్పీ కృష్ణమోహన్ ఆదేశాల మేరకు కొత్తపల్లిలో పోలీసు సిబ్బందితో కలిసి ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించారు.

ఈ సందర్భంగా యువత గంజాయి, సొల్యూషన్ వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా ఉన్న ప్రదేశాలను గుర్తించి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

రాయచోటిలో పోలీస్ యాక్ట్ 30 అమలులో ఉందని, రాత్రి 10:30 తర్వాత అత్యవసరం అయితే తప్ప బయట తిరగకూడదన్నారు. వ్యాపారులు కూడా సమయానికి దుకాణాలు మూసివేయాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానాలు, చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు...

0
88 views

Comment