logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ఆపరేషన్ గరుడ:

అన్నమయ్య: ఆపరేషన్ గరుడ: మెడికల్ షాపుల తనిఖీలు

అన్నమయ్య జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు “ఆపరేషన్ గరుడ” కింద ఈగిల్ సెల్, డ్రగ్ ఇన్‌స్పెక్టర్ సంయుక్తంగా మెడికల్ షాపులపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తనిఖీలలో భాగంగా NRX వర్గానికి చెందిన అల్ట్రాసెట్, ఆల్ప్రాజోలామ్, క్లోనాజెపామ్ వంటి మందులను డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా విక్రయించరాదని స్పష్టం చేశారు.

ప్రిస్క్రిప్షన్ ఉన్నప్పుడే రిజిస్టర్‌లో నమోదు చేసి మందులు ఇవ్వాలని, షాపుల రికార్డులు, బిల్లులు, లైసెన్సులను క్షుణ్ణంగా పరిశీలించారు. గడువు ముగిసిన మందులను విక్రయించరాదని హెచ్చరించారు.

నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజలు వైద్యుల సూచన మేరకే మందులు వినియోగించాలని అధికారులు సూచించారు.

0
46 views

Comment