logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

మూడు రోజుల పాటు సెన్సస్-2027 శిక్షణ తరగతులు

కామారెడ్డి ప్రతినిధి
తేది :17.04.2026

కామారెడ్డి జిల్లా
శుక్రవారం

రేపటి నుండి మూడు రోజుల పాటు సెన్సస్-2027 శిక్షణ తరగతులు

శుక్రవారం జనగనన ప్రక్రియ పై ఇన్యూమరేటర్లు,
సూపర్ వైజర్లకు రేపటి నుండి మూడు రోజులపాటు నిర్వహించనున్న శిక్షణ తరగతుల పై జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సంబంధిత అధికారులతో సాయంత్రం టెలి కాన్ఫరెన్స్ నిర్వహించి దిశా నిర్దేశం చేశారు.
ఈ సందర్బంగా మెదటి విడత లో
తాడ్వాయి, లింగంపేట్, బిచ్కుండా, మాచారెడ్డి, సదాశివనగర్, జుక్కల్, మద్నూర్, గాంధారి, పిట్లం, నాగిరెడ్డిపేట్, ఎల్లారెడ్డి, బిర్కూర్, బాన్సువాడ మండలాల్లో సెన్సస్-2027 శిక్షణ తరగతులు నిర్వహించబడనున్నాయని అలాగే, మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ కౌన్సిల్ కామారెడ్డి పరిధిలో 2 బ్యాచ్‌లుగా శిక్షణ నిర్వహించబడుతుందని అన్నారు.
ఈ శిక్షణ తరగతులను క్రమ శిక్షణ తో వింటూ అవగాహన చేసుకొని జన గణన ప్రక్రియ లో తప్పులు దొర్ల కుండా సజావుగా నిర్వహించాలని ఆదేశించారు.

54
1930 views

Comment