తెలంగాణ ప్రజలకు తేజస్వి సూర్య క్షమాపణలు చెప్పాలని టిఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు జబ్బర్ డిమాండ్
ఇవ్వాళ పార్లమెంట్ ప్రత్యేక సమావేశల సందర్భంగా మహిళా బిల్లు పై మాట్లాడకుండా తెలంగాణా విభజనను ఇండియా పాకిస్థాన్ విభజనతో పోల్చి రాజ్యాంగాన్ని, నాలుగు కోట్లమంది తెలంగాణా ప్రజలను అవగాహనా రాహిత్యంతో తేజస్వి సూర్య అవమాన పరిచారు. ఇది తెలంగాణ అమరవీరుల త్యాగాలను అవహేళన చేయటమే. ఈ మాటలను వెనక్కు తీసుకుంటూ భేషరతుగా తెలంగాణా ప్రజలకు క్షమాపణ చెప్పాలి. తెలంగాణ ఏర్పాటు కోసం బీజేపీ కూడా తెలంగాణా జేఏసీ లో భాగస్వామిగా ఉండి రోడ్లమీద ఉద్యమాలు చేసింది, తెలంగాణ బిల్లుకు పార్లమెంట్ లో గట్టి మద్దతు దారునిగా నిలిచిందనే కనీస సోయి కూడా ఒక పార్లమెంట్ సభ్యునిగా అవగాహన లేకుండా మాట్లాడటం విచారకరం.
పార్లమెంట్ లో దాదాపుగా అన్ని పార్టీలు తెలంగాణా బిల్లును ఆనాడు సమర్దించాయి. ఈ సభ్యుడు తన అవగాహన లేమితో వారందరిని అవమానించినట్లుగానే భావించాలిసి వస్తుంది. ఇలాంటి దిగజారుడు మాటలు మాట్లాడి రాజ్యాంగన్ని తెలంగాణా ప్రజలను అవమానం పార్చిన తేజస్వి సూర్యను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నామని తెలంగాణా ఉద్యమ నాయకుడు, మాజీ గ్రంధాలయ సంస్థ చైర్మన్ దిండిగాలా రాజేందర్ డిమాండ్ చేసారు.ఈ కార్యక్రమం లో..
దిండిగాల రాజేందర్, సుదర్శనం రంగనాథ్, సిలివేరు సత్యనారాయణ,
Md. అబ్దుల్ జబ్బార్, శీలం రమేష్, పరిచూరి వెంకటేశ్వర్లు, sk. గాజీ అజ్మేరా భావ్ సింగ్,
దాస్యం ప్రమోద్, డేరంగుల పోషం,నాగరాజు
నారపాక వసంత రావు, రాచపల్లి శ్రీను, సనా రాజేష్
స్వర్ణ పాక సత్యనారాయణ
రామ్‌లాల్ పాసి
లలిత్ పాసి, శ్రీకాంత్, మల్సూర్, యలమందల వాసు, చిన్నారి
గడ్డి శ్రీను, అటో పాసి
గధే రమేష్,శ్రీను
Sk. ఇమ్రాన్, గోల్డ్ ఇమ్రాన్, షేక్ కరీం పాషా, చీమల సుజాత, మదర్ బీ, భాగ్య,
దమర శ్రీనివాస్, కుంజ సతీష్,
మనఘంటి శివ, రసూల్
మాన్య, కిషన్ పాసి
వీరభద్రం, శ్రీనివాస రావు
కోడి లక్ష్మయ్య, బజారు సత్యనారాయణ,
ఖమృ,
శ్రీకాంత్ యాదవ్ మరియు ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు.