ప్రభుత్వ ఉర్దూ పాఠశాలల్లో మీ పిల్లలను చేర్పించండి
వి. యన్. అమీర్ బాబు
వైస్ ప్రెసిడెంట్
అంజుమన్ తరఖ్ఖి ఉర్దూ కడప జిల్లా శాఖ
ప్రెస్ రిలీజ్
కడప 17.4.2026
ప్రభుత్వ ఉర్దూ పాఠశాలల్లో మీ పిల్లలను చేర్పించండి
వి. యన్. అమీర్ బాబు
వైస్ ప్రెసిడెంట్
అంజుమన్ తరఖ్ఖి ఉర్దూ కడప జిల్లా శాఖ
రాష్ట్ర అంజుమన్ తరఖ్ఖి ఉర్దూ ఆధ్వర్యంలో ప్రచురించిన కరపత్రాలను శుక్రవారం మధ్యాహ్నం సంస్థ కార్యాలయం లో ఆవిష్కరించారు.
ప్రభుత్వ ఉర్దూ పాఠశాలల్లో అన్ని వసతులున్నాయని, ఉచిత భోజనం, ఉచిత పాఠ్యపుకాలు శిక్షణ పొందిన ఉపాధ్యాయుల తో భోధన జరుగుతుందని ఉర్దూ విద్య అభివృద్ధి కి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని టిడిపి రాష్ట్ర నాయకులు అమీర్ బాబు అన్నారు.
అంజుమన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హిదాయతుల్లా మాట్లాడుతూ మాతృ భాష లో చదివితే మంచి ఫలితాలు ఉంటాయని అన్నారు. రాష్ట్ర లోని అన్ని జిల్లాలకు ఈ కరపత్రాలు పంపిణీ చేయనున్నారని తెలిపారు.అంజమన్ జిల్లా అధ్యక్షులు సత్తార్ ఫైజి ప్రసంగిస్తూ ఉర్దూ కు ఉజ్వల భవిష్యత్తు ఉందని అన్నారు.ఉత్తమ ఉర్దూ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహిస్తూనందుకు హర్షం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో డిసిసి మాజీ జిల్లా అధ్యక్షులు నజీర్ అహ్మద్, అంజుమన్ కార్యవర్గ సభ్యులు అయ్యుబ్, తయ్యబ్, ఐటా నజీర్, సిరాజ్ బొఖారి ఖదీర్ పర్వేజ్ లు పాల్గొన్నారు.