logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

పాతపట్నం నియోజకవర్గం కేంద్రంలో మీడియా సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే ఎంజిఆర్ గారు

AIMA news :
పాతపట్నం నియోజకవర్గం కేంద్రంలో మీడియా సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే ఎంజిఆర్ గారు...

అన్న క్యాంటీన్ పథకం ద్వారా పేదల ఆకలి తీర్చడం ప్రభుత్వ లక్ష్యం – ఎమ్మెల్యే మామిడి గోవిందరావు (ఎంజీఆర్) గారు...

269 అన్న క్యాంటీన్లలో 207 తిరిగి ప్రారంభం – విటిలో 2.10 లక్షల మంది భోజనం చేస్తురన్న ఎమ్మెల్యే ఎంజీఆర్ గారు...

పాతపట్నం నియోజకవర్గం బస్టాండ్ దగ్గర మేజర్ పంచాయతీ వద్ద నూతనంగా నిర్మించిన అన్న క్యాంటీన్ ప్రారంభించిన అనంతరం మీడియా సమావేశంలో ఎమ్మెల్యే శ్రీ మామిడి గోవిందరావు (ఎంజీఆర్) గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పేద ప్రజల ఆకలి తీర్చడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు.రాష్ట్రవ్యాప్తంగా గతంలో 269 అన్న క్యాంటీన్లు ప్రారంభించగా, 2019-24 మధ్య కాలంలో అవి నిలిచిపోయాయని గుర్తు చేశారు. ప్రస్తుతం ప్రభుత్వం మళ్లీ 207 అన్న క్యాంటీన్లను ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చిందన్నారు. మిగిలిన క్యాంటీన్లను కూడా దశల వారీగా పునఃప్రారంభం చేస్తామని తెలిపారు.ప్రస్తుతం ప్రతి రోజు లక్షలాది మంది పేదలు అన్న క్యాంటీన్ల ద్వారా లబ్ధి పొందుతున్నారని,భోజనం అందిస్తూ ప్రభుత్వం గొప్ప సేవ చేస్తోందన్నారు.ప్రజలకు మాత్రం తక్కువ ధరలో నాణ్యమైన ఆహారం అందిస్తున్నామని చెప్పారు.అదేవిధంగా సబ్సిడీ కింద ప్రభుత్వం భారీగా నిధులు ఖర్చు చేస్తోందని, ఇప్పటివరకు కోట్ల రూపాయలు వెచ్చించినట్లు వివరించారు. భవిష్యత్తులో మరిన్ని క్యాంటీన్లు ప్రారంభించి పేదలందరికీ అందుబాటులోకి తీసుకురావడం లక్ష్యమని తెలిపారు.అన్న క్యాంటీన్ పథకాన్ని స్వచ్ఛంద సంస్థలు, దాతలు సహకారంతో మరింత బలోపేతం చేస్తామని చెప్పారు.పేద ప్రజలకు తక్కువ ధరలో మంచి ఆహారం అందించడం ద్వారా వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడం ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే ఎంజీఆర్ గారు స్పష్టం చేశారు

0
24 views

Comment