జిల్లా కేంద్రంలోని ఇందిరాగాంధీ స్టేడియం పక్కన నిర్మాణంలో ఉన్న ఇండోర్ స్టేడియం పనులను పరిశీలించిన కలెక్టర్ ఆశిష్ సాంగ్వన్
కామారెడ్డి ప్రతినిధి
తేది: 16.04.2026
కామారెడ్డి జిల్లా
గురువారం
కామారెడ్డిజిల్లా కేంద్రంలోని ఇందిరాగాంధీ స్టేడియం పక్కన నిర్మాణంలో ఉన్న ఇండోర్ స్టేడియం పనులను జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ గురువారం ఉదయం పరిశీలించారు.
ఈ సందర్భంగా నిర్మాణ పనుల పురోగతిని సమీక్షించి, జరుగుతున్న పనుల నాణ్యతను అంచనా వేసి, ప్రాజెక్టును నిర్ణీత గడువులో పూర్తి చేయడానికి అవసరమైన మార్గదర్శకాలను సంబంధిత అధికారులకు అందించారు.
అలాగే అక్కడ నిర్వహిస్తున్న కబడ్డీ సమ్మర్ కోచింగ్ క్యాంపును సందర్శించి, విద్యార్థులతో కలిసి కబడ్డీ ఆడి వారిని ప్రోత్సహించారు.
ఈ ఇండోర్ స్టేడియంలో 4 షటిల్ బ్యాడ్మింటన్ కోర్టులు, యోగా హాల్, ఇండోర్ గేమ్స్ సదుపాయాలు, జిమ్, రైఫిల్ షూటింగ్, స్క్వాష్ కోర్ట్ వంటి ఆధునిక సౌకర్యాలు ఏర్పాటు చేయబడుతున్నాయి. జిల్లాలో యువతకు క్రీడలు, వినోద కార్యక్రమాలను ప్రోత్సహించేందుకు మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తామని కలెక్టర్ తెలిపారు. ఇందిరాగాంధీ స్టేడియాన్ని అన్ని రకాల క్రీడా సదుపాయాలతో అభివృద్ధి చేయడానికి కృషి చేస్తామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కామారెడ్డి ఆర్‌డీవో ఎన్.వై. గిరి, పబ్లిక్ హెల్త్ డీఈ సంతోష్, కాంట్రాక్టర్ ఏజెన్సీ సభ్యుడు వెంకటరమణ, జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి తదితరులు పాల్గొన్నారు.