అంబేద్కర్ 135వ జయంతి వేడుకలకు హాజరైన సాలూరు బీజేపీ శ్రేణులు...
భారత రాజ్యాంగ నిర్మాత డా. బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా సాలూరు నియోజకవర్గంలో బీజేపీ నాయకులు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సాలూరు నియోజకవర్గ బీజేపీ బి ఎల్ ఏ 1డా. హేమనాయక్ ఆధ్వర్యంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఆయన సేవలను స్మరించుకున్నారు.
ఈ సందర్భంగా సాలూరు ఇన్ ఛార్జ్/ బి.ఎల్.ఏ1 డా. వి. హేమనాయక్ మాట్లాడుతూ, డా. బి.ఆర్. అంబేద్కర్ ఒక జాతికి, ఒక కులానికి, ఒక మతానికి మాత్రమే చెందిన నాయకుడు కాదని, భారతదేశంలోని ప్రతి పౌరుడికి రాజ్యాంగాన్ని అందించిన మహానీయుడు అని అన్నారు. ఆయన అడుగుజాడల్లో నడుస్తూ, ఆయన విజన్‌ను అనుసరిస్తూ ప్రతి ఒక్కరూ రాజ్యాంగం కల్పించిన హక్కులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలు తమకు కల్పించిన రిజర్వేషన్లను ఉపయోగించుకొని కుటుంబం, గ్రామం, సమాజం, దేశ అభివృద్ధికి తోడ్పడాలని సూచించారు. రాజ్యాంగంలో పొందుపరిచిన మౌలిక హక్కులు, ఆదేశిక సూత్రాలు, సామాజిక, ఆర్థిక అభివృద్ధి అంశాలు ప్రతి పౌరుడికి సమాన హక్కులను కల్పించేలా ఉన్నాయని పేర్కొన్నారు.
చివరిగా “జోహార్ జోహార్… జై జై భీమ్… మన డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్” అంటూ నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో పార్వతీపురం మన్యం జిల్లా బీజేపీ ఉపాధ్యక్షులు పేర్ల విశ్వేశ్వరరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి గొర్లె భానోజీరావు, సాలూరు పట్టణ అధ్యక్షుడు వానపల్లి మురళీకృష్ణ, సీనియర్ నాయకులు బూరాడ సూరయ్య, పైల సింహాచలం, పూసర్ల గోవిందరావు తదితరులు పాల్గొన్నారు. పలువురు బీజేపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై అంబేద్కర్ ఆశయాలను స్మరించారు.