logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

మహా వృక్షాలను సైతం నరికి సొమ్ము చేసుకుంటున్న వారి భారీ నుండి వృక్షాలను రక్షించండి.

నంద్యాల జిల్లా రుద్రవరం మండలం లో మహా వృక్షాలను సైతం నరికి సొమ్ము చేసుకునే వారి సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుందని వృక్ష ప్రేమికులు వాపోతున్నారు. గురువారం నాడు చిన్న కంబలూరు పోలిమేర పంట పొలాలకు వెళ్లే దారిలో కాలువ కట్టమీద ఉన్న మహా వేప వృక్షాలను సైతం కోత మిషన్లు ఉపయోగించి వృక్షాలను నరికి సొమ్ము చేసుకుని పర్యావరణానికి తీరని నష్టం కలిగిస్తున్న పట్టించుకునే నాధుడే లేదని వారి భారీ నుండి మహావృక్షాలను కాపాడాలని వృక్ష ప్రేమికులు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చిహ్నం అయినటువంటి వేప చెట్టుకు భద్రత లేకుండా పోతుందని విచ్చలవిడిగా కోత మిషన్లు ఉపయోగించి మండలంలో పలుచోట్ల అక్రమ దారులు వృక్షాలను నరికి సొమ్ము చేసుకుంటున్న పట్టించుకునే నాధుడే కరువయ్యారని ఉన్నతాధికారులు వెంటనే స్పందించి వృక్షజాతులను కాపాడాలని మహా వృక్షాలను సైతం నరికి సొమ్ము చేసుకుంటున్న వారి పై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు వృక్ష ప్రేమికులు వేడుకుంటున్నారు.

106
2568 views

Comment