నకిరేకల్‌లో ARRIVE-ALIVE కార్యక్రమం | రోడ్డు భద్రతపై అవగాహన సభ
ChatGPT
Open the ChatGPT app
Try the full app experience
Open
నల్గొండ జిల్లా :-
ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నకిరేకల్ పట్టణంలోని నారాయణ హై స్కూల్ నందు విధ్యార్ధులకు రోడ్డు భద్రతా పై అవగాహన కార్యక్రమం నిర్వహించి., అనంతరం పట్టణంలోని మినీ స్టేడియం నందు నిర్వహించిన "ARRIVE - ALIVE" కార్యక్రమంలో పాల్గొన్న,
తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ నల్లగొండ జిల్లా ఇన్‌చార్జి మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు, తెలంగాణ రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి గారు, ప్రభుత్వ విప్ నకిరేకల్ ఎమ్మెల్యే శ్రీ వేముల వీరేశం గారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు బత్తుల లక్ష్మారెడ్డి గారు, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు గారు, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం గారు, డెయిరీ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి గారు, జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ గారు, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ గారు, సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ గారు, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పున్న కైలాష్ నేత గారు, రాంరెడ్డి స్వరోతం రెడ్డి గారు, నకిరేకల్ నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
*_ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ వేముల వీరేశం గారు మాట్లాడుతూ_* :-
🔹దాదాపు 75 కిలోమీటర్ల విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారి నకిరేకల్ నియోజకవర్గంలో ఉంది. రోడ్డు ప్రమాదంలో ఒకరు చనిపోయి డెడ్‌బాడీ హాస్పిటల్ చేరేలోపు మరో యాక్సిడెంట్ అవుతుంది. కాబట్టి రోడ్డు ప్రయాణం అనేది చాలా జాగ్రత్తగా నియమ నిబంధనలు పాటిస్తూ చేస్తే ఏ సమస్య ఉండదు. లేకుంటే మన కుటుంబాలు వీధిన పడే అవకాశం ఉంది.
🔹ARRIVE-ALIVE గొప్ప కార్యక్రమం. నా నియోజకవర్గం నకిరేకల్‌లో ఈ అవగాహన కార్యక్రమానికి అవకాశం ఇచ్చిన డీజీపీ గారికి కృతజ్ఞతలు.
*_డీజీపీ శివధర్ రెడ్డి గారు మాట్లాడుతూ_*:-
🔹ప్రతి ఏటా రోడ్డు ప్రమాదాల్లో అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లగా, ప్రజలు రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా అవగాహన తీసుకురావాలనే ఉద్దేశంతోనే ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టారు.
🔹రోడ్డు మీద జరిగే ప్రమాదాల్లో 70% టూ వీలర్స్ ప్రమాదాలే జరుగుతున్నాయి. కాబట్టి టూ వీలర్స్ మీద ప్రయాణం చేసేవారు హెల్మెట్ తప్పకుండా ధరించాలి. రోడ్డు మీద చాలా జాగ్రత్తగా ప్రయాణించాలి.
🔹కార్లల్లో ప్రయాణించే వాళ్ళు తప్పకుండా సీట్ బెల్ట్ పెట్టుకుంటే మన ప్రాణాలు కాపాడుకోవచ్చు. రోడ్డు ప్రయాణంలో పరిసరాల మీద దృష్టి పెట్టి ప్రయాణం చేయాలి.
*_మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు మాట్లాడుతూ :-_*
🔹ప్రజలను రోడ్డు ప్రమాదాల మీద అవగాహన పరచాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ARRIVE-ALIVE కార్యక్రమం తీసుకోవడం జరిగింది. రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకొని ప్రయాణం చేయాలి. మన కుటుంబాల బాధ్యత మనమీదనే ఉంటుంది. మనకేమైన జరిగితే మన కుటుంబం చిన్నాభిన్నం అవుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా రోడ్డు ప్రయాణం చేయాలి.
🔹నకిరేకల్ నియోజకవర్గంలో హైవే పైన గ్రామాల వద్ద బ్రిడ్జిల నిర్మాణం చేపడుతాం. హై స్పీడ్‌గా వెహికల్ నడపవద్దు.
🔹రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల కరెంట్ ఇస్తున్నారు.
🔹మీ నియోజకవర్గంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలకు నా వంతు సహకారం ఉంటుంది. మీ ఎమ్మెల్యే వీరేశం గారు నాకు మంచి మిత్రుడు.