కడప జిల్లా కడప నగరంలో ఆర్టీసీ బస్టాండ్ సర్కిల్ నందు అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి.
కడప జిల్లా కడప నగరంలో ఆర్టీసీ బస్టాండ్ సర్కిల్ నందు అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి.
అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈరోజు ఎస్సీ, ఎస్టీ హ్యూమన్ రైట్స్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా జేవీ రమణ (రాయలసీమ అధ్యక్షులు, ఎస్సీ ఎస్టీ హ్యూమన్ రైట్స్ హెల్పర్ ఫోరం), మల్లికార్జున (జాతీయ అధ్యక్షుడు) హాజరయ్యారు.
అలాగే రాజు, వెంకట శివ, భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆశయాలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు అర్పించి, ఆయన సేవలను కొనియాడారు.
నాయకులు మాట్లాడుతూ సమాజంలో సమానత్వం, న్యాయం కోసం అంబేద్కర్ చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు.