పాఠశాలలు పునః ప్రారంభం నాటికి
హాస్టళ్లన్నీ పూర్తి వసతులతో సిద్దంగా ఉండాలని
పాఠశాలలు పునః ప్రారంభం నాటికి ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లన్నీ పూర్తి వసతులతో సిద్దంగా ఉండాలని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. రాష్ట్ర సచివాలయంలోని ఆర్టీజీఎస్ నుంచి క్షేత్రస్థాయిలో వివిధ శాఖల పనితీరుపై నేడు సమీక్షించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సాయి ప్రసాద్, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.