డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా
రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా DM CSC NALGONDA VLE'S లందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం అనే మహత్తర విలువలను మన రాజ్యాంగం ద్వారా అందించిన మహనీయుడని ఆయన కొనియాడారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారు చూపిన మార్గం సమాజానికి ఎల్లప్పుడూ దిశానిర్దేశం చేస్తూనే ఉంటుందని పేర్కొన్నారు.
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా అందరికీ సమాన అవకాశాలు కల్పించే సమాజ నిర్మాణం కోసం మనమంతా కట్టుబడి పనిచేయాలని పిలుపునిచ్చారు. సామాజిక న్యాయం, సమానత్వం కోసం అంబేద్కర్ గారి స్ఫూర్తితో ప్రజా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని ఈ సందర్భంగా CSC DM Nalgonda గారు పునరుద్ఘాటించారు.