logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

వార్డ్ సభ్యుల శిక్షణా తరగతులపై ఆర్టీఐ దరఖాస్తు -21 అంశాలకు సమాచారం ఇవ్వాలని కోరిన చుక్క గంగారెడ్డి ఇరకాటంలో పంచాయతీ రాజ్, పోలీస్, వ్యవసాయ శాఖలు

వార్డ్ సభ్యుల శిక్షణా తరగతులపై ఆర్టీఐ దరఖాస్తు

21 అంశాలకు సమాచారం ఇవ్వాలని కోరిన చుక్క గంగారెడ్డి

ఇరకాటంలో పంచాయతీ రాజ్ శాఖ, పోలీస్ శాఖ, వ్యవసాయ శాఖ

బుగ్గారం / జగిత్యాల జిల్లా:

అత్యంత వివాదా స్పదంగా మారిన జగిత్యాల జిల్లా బుగ్గారం మండల వార్డ్ సభ్యుల శిక్షణా తరగతులపై సమాచారం ఇవ్వాలని సోమవారం బుగ్గారం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలోని ప్రజా సమాచార అధికారికి ప్రముఖ సీనియర్ ఆర్టీఐ కార్యకర్త, సామాజిక కార్యకర్త చుక్క గంగారెడ్డి దరఖాస్తు చేశారు.
ఆ దరఖాస్తులో 21 అంశాలకు సంబంధించిన సమాచారం కావాలని ఆయన కోరారు. ఇందులో పంచాయతీ రాజ్ శాఖ, పోలీస్ శాఖ, వ్యవసాయ శాఖలకు సంబంధించిన సమాచారం కూడా ఉండడం శోషనీయం. ఆ మూడు శాఖలు ఈ ఆర్టీఐ దరఖాస్తుతో ఇరకాటంలో పడ్డట్లేనా...? అని ప్రజలు ముచ్చటిస్తున్నారు.
ఇక అట్టి దరఖాస్తులోని 21 అంశాలకు సంబంధించిన పూర్తి సమాచారం గడువులోపు సంబంధిత అధికారులు జారీ చేస్తారో.... లేక కాలక్షేపం చేసి మా దగ్గర సమాచారమే లేదని చేతులు ఎత్తేస్తారో.... కాస్త వేచి చూడాల్సిందే....

1
122 views

Comment