కడప జిల్లా కడప నగరంలో శుభమస్తు షాపింగ్ మాల్ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
కడప జిల్లా కడప నగరంలోని ఎరుముక్కపల సర్కిల్ వద్ద, మానస ఇన్ రెస్టారెంట్ ఎదురుగా శుభమస్తు షాపింగ్ మాల్ ఆధ్వర్యంలో మజ్జిగ చలివేంద్రం పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కడప నగరం ట్రాఫిక్ ఇన్‌చార్జ్ సురేష్ రెడ్డి హాజరై ప్రజలకు మజ్జిగ పంపిణీ చేశారు. వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఏర్పాటు చేసిన ఈ చలివేంద్రం ద్వారా ప్రయాణికులు, స్థానికులు ఉపశమనం పొందారు.
ఈ సందర్భంగా శుభమస్తు షాపింగ్ మాల్ మేనేజర్ వెంకటరమణ, సాయి ప్రసాద్ మాట్లాడుతూ, ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు.