నిఘ నేత్రంలో ఆదిలాబాద్ జిల్లా*
*490 నూతన సీసీటీవీ కెమెరాల ప్రారంభం.*
*
ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా నేరాలు జరగకుండా జరిగిన నేరాలు ఛేదించడానికి పూర్తిగా నిఘా నేత్రంలో రావడానికి దాదాపు ఆదిలాబాద్ పట్టణంలో నూతనంగా మరియు అదనంగా 207 సిసిటీవీ కెమెరాలు మరియు జిల్లా వ్యాప్తంగా ఉన్న మండలాలలో, గ్రామాలలో నూతనంగా 283 సీసీటీవీ కెమెరాలను ఈరోజు రాష్ట్ర డిజిపి బి శివధర్ రెడ్డి స్థానిక పట్టణంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ నందు ప్రారంభించడం జరిగింది. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 700 సిసి టీవీ కెమెరాలతో పర్యవేక్షణ కొనసాగుతుంది. నేరాల నియంత్రణలో సీసీటీవీ కెమెరాల పాత్ర కీలకంగా ఉంటూ, ఒక కెమెరా 100 మంది పోలీసు సిబ్బందితో సమానంగా వ్యవహరిస్తుందని తెలిపారు. ప్రజలు, వ్యాపార సంస్థలు, తమ గ్రామాలలో పట్టణాలలో వీధులలో స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరూ సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసుకునే విధంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. నేరస్తులు సీసీటీవీ కెమెరాలు ఉన్న ప్రదేశాలలో నేరాలను చేయడానికి భయపడతారని తెలిపారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ వద్ద నేరాల నియంత్రణ 24 గంటలు క్రమం తప్పకుండా జరుగుతూ ఉంటుందని, నేరాలను నియంత్రించేందుకు నిష్ణాతులైన పోలీసు సిబ్బంది అనుక్షణం పర్యవేక్షిస్తూ ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, అదనపు ఎస్పీ బి సురేందర్ రావు, పరిపాలన అదనపు ఎస్పి పి మౌనిక,శిక్షణ ఐపిఎస్ రాహుల్ కాంత్, ఆదిలాబాద్ డిఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి, పట్టణ సీఐలు, ఎస్సైలు, రిజర్వు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.