logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

12వ డివిజన్‌లో పారిశుధ్య పనులపై కమిషనర్ మార్నింగ్ విజిట్

ప్రెస్ నోట్
కడప నగరపాలక సంస్థ
తేదీ: 13-04-2026

12వ డివిజన్‌లో పారిశుధ్య పనులపై కమిషనర్ మార్నింగ్ విజిట్

కడప నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీ రాకేశ్ చంద్ర గారు నేడు మార్నింగ్ విజిట్‌లో భాగంగా నగరంలోని 12వ డివిజన్‌ను సందర్శించి పారిశుధ్య పనులను ప్రత్యక్షంగా పరిశీలించారు.

ఈ సందర్భంగా 12వ డివిజన్‌లో ఉన్న జివిపి (GVP) పాయింట్లను పూర్తిగా తొలగించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ప్రజలకు చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకుండా, క్లాప్ ఆటోలను సద్వినియోగం చేసుకోవాలని అవగాహన కల్పించారు. ఇంటింటికి వచ్చే క్లాప్ ఆటోల ద్వారా చెత్తను అందజేయాలని సూచించారు.

అదేవిధంగా ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి, చెత్త పారవేసే ప్రదేశాన్ని పూర్తిగా శుభ్రపరచించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ గారు స్వయంగా పాల్గొని పరిసరాలను శుభ్రపరిచారు. అనంతరం అక్కడ మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో MHO గారు, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్ని మొక్కలు నాటారు.

0
99 views

Comment