logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

అభిమానులే మా బలం. జనసైనికుడి వివాహ వేడుకలో ఇరిగెల సోదరులు.

AIMA న్యూస్ నంద్యాల జిల్లా. ఆళ్లగడ్డ పట్టణంలోని కందుకూరు రోడ్డులో గల ఏవీ (AV) ఫంక్షన్ హాల్‌ నందు ఆదివారం నాడు వివాహ వేడుక అత్యంత వైభవంగా జరిగింది. ఆళ్లగడ్డ మండలం ఎస్. లింగందిన్నె గ్రామానికి చెందిన ఇరిగెల కుటుంబానికి అత్యంత ఆప్తుడు, జనసేన పార్టీ నాయకులు దూదేకుల రామకృష్ణుడు ప్రథమ పుత్రుడు దూదేకుల చంద్ర (నాని) వివాహ మహోత్సవానికి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు ఇరిగెల రామచంద్రారెడ్డి, జున్ను ప్రసాద్ రెడ్డి, ఇరిగెల సూర్యనారాయణ రెడ్డి వారి కుటుంబ సమేతంగా హాజరయ్యారు.జనసేన పార్టీ పట్ల అంకితభావం కలిగిన కార్యకర్త ఇంటి వేడుకకు ఇరిగెల సోదరులు స్వయంగా విచ్చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. నూతన వధూవరులను ఆశీర్వదించారు.
ఈ సందర్భంగా ఇరిగెల సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ. రాజకీయాలకు అతీతంగా ఇరిగెల కుటుంబం ఎప్పుడూ ప్రజల మధ్యే ఉంటుందని. కష్టనష్టాల్లో తోడుండే కార్యకర్తలే తమ అసలైన బలమని, తమను నమ్ముకున్న వారు, పార్టీ కోసం అహర్నిశలు శ్రమిస్తున్న వారు తమ సొంత కుటుంబ సభ్యులతో సమానమని స్పష్టం చేశారు. వారి ఇంట్లో జరిగే ఏ చిన్న శుభకార్యమైనా అది తమ ఇంట్లో వేడుకగానే భావిస్తామన్నారు. నూతన దంపతులు అన్యోన్యంగా ఉంటూ, పెద్దల ఆశీస్సులతో సమాజంలో ఉన్నత స్థానానికి చేరుకోవాలని, వారి వైవాహిక జీవితం ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో, ఐశ్వర్యంతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.
ఈ పవిత్రమైన వివాహ బంధంలోకి అడుగుపెడుతున్న నవదంపతులకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆత్మీయ విందులో కార్యకర్తలు, ప్రజలతో కలిసి భోజనం చేయడం జరిగింది.

147
3154 views

Comment