ఆళ్లగడ్డలో గ్రీన్ లైఫ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత మజ్జిగ పంపిణీ.
AIMA న్యూస్ నంద్యాల జిల్లా. పెరుగుతున్న ఎండల దృష్ట్యా సామాజిక బాధ్యతగా ఆళ్లగడ్డ పట్టణంలో సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఆదివారం స్థానిక టీబీ రోడ్డు( తాటి బెల్లం టీ స్టాల్) నందు గ్రీన్ లైఫ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బాటసారులకు, వాహనదారులకు ఆదివారం నాడు ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమం ఫౌండేషన్ ఎండి బాల ఓబన్న, ఉపాధ్యక్షులు అశోక్ ల నేతృత్వంలో జరిగింది. వీరితో పాటు పెద్ద ఓబయ్య, ఆచార్య బ్రహ్మయ్య, విశ్వనాథ్ రెడ్డి, దస్తగిరి, శంకర్ తదితరులు చురుగ్గా పాల్గొని స్వయంగా మజ్జిగను పంపిణీ చేశారు.వేసవి తాపంతో అల్లాడుతున్న ప్రయాణికులు, కూలీలు మరియు వాహనదారులకు ఉపశమనం కలిగించేందుకు ఈ పాయింట్ ఏర్పాటు చేశారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు వందలాది మందికి చల్లని మజ్జిగను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఫౌండేషన్ ఎండి బాల ఓబన్న మాట్లాడుతూ. మానవ సేవే మాధవ సేవ అనే లక్ష్యంతో గ్రీన్ లైఫ్ ఫౌండేషన్ పనిచేస్తోందని, వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చడం సంతోషంగా ఉందని తెలిపారు. తమ ఫౌండేషన్ ద్వారా భవిష్యత్తులో మరిన్ని సామాజిక సేవా కార్యక్రమాలు చేపడతామని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు, స్థానిక స్వచ్ఛంద కార్యకర్తలు మరియు పట్టణ ప్రముఖులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.