logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ఇండోర్ స్టేడియం నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం

కామారెడ్డి ప్రతినిధి
తేది :11.04.2026

కామారెడ్డి జిల్లా కేంద్రం లోని ఇందిరా గాంధీ స్టేడియం ప్రాంగణంలో రూ. 800.00 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న ఇండోర్ స్టేడియం నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం ఘనంగా శనివారం నిర్వహించబడింది.
ఈ కార్యక్రమానికి ప్రభుత్వ సలహాదారులు, అదనపు కలెక్టర్ విక్టర్ ముఖ్య అతిథులుగా హాజరై భూమి పూజ చేశారు.

ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు TUFIDC సహాయంతో అమలుచేయబడుతూ, ఆధునిక క్రీడా సదుపాయాలతో యువతకు ఉపయోగపడే విధంగా రూపొందించబడుతోందని, ఇందులో బ్యాడ్మింటన్ కోర్టులు, స్క్వాష్ కోర్ట్, ఇండోర్ షూటింగ్ రేంజ్, టేబుల్ టెన్నిస్ హాల్, యోగా హాల్, జిమ్నాసియం వంటి సదుపాయాలు ఏర్పాటు చేయబడనున్నాయని అన్నారు.

ఇండోర్ స్టేడియం నిర్మాణం ద్వారా ప్రాంతీయ యువతకు ఉత్తమ క్రీడా వేదిక అందుబాటులోకి వస్తుందని, క్రీడా అభివృద్ధికి ఇది ఎంతో దోహదపడుతుందని తెలిపారు.

కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, స్థానికులు పాల్గొన్నారు.

8
552 views

Comment