logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

భారత చైతన్య యువజన పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ బోడె రామచంద్ర యాదవ్ గారు చేపట్టిన బీసీ ధర్మ దీక్ష – ఆమరణ నిరాహార దీక్ష ఈరోజుతో రెండవ రోజుకు చేరుకుంది.

భారత చైతన్య యువజన పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ బోడె రామచంద్ర యాదవ్ గారు చేపట్టిన బీసీ ధర్మ దీక్ష – ఆమరణ నిరాహార దీక్ష ఈరోజుతో రెండవ రోజుకు చేరుకుంది. అయినప్పటికీ ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేకపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
ఈ రాష్ట్రంలో సుమారు 3 కోట్ల బీసీ జనాభా ఉన్నప్పటికీ, వారి సమస్యలను ప్రభుత్వం పట్టించుకోకపోవడం అన్యాయం. కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న కొద్దిమంది బీసీ కుటుంబాలను మినహాయిస్తే, మిగిలిన బీసీ సమాజం ఇక మౌనం వహించబోదు.
👉 ఈరోజు నుండి రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సమాజం పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి శాంతియుతంగా తమ హక్కుల కోసం ఆందోళనలు చేపట్టనుంది.
ఈ రాష్ట్ర 3 కోట్ల బీసీల కోసం బోడె రామచంద్ర యాదవ్ గారు చేస్తున్న ఈ దీక్షకు లేదా ఆయన వ్యక్తిగత భద్రతకు ఏవైనా ఇబ్బందులు కలిగితే, బీసీ సమాజం మొత్తం తీవ్రంగా ప్రతిస్పందించాల్సి వస్తుందని ఈ సభా వేదికగా హెచ్చరిస్తున్నాము.
ప్రభుత్వం వెంటనే స్పందించి బీసీల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలి. లేనిపక్షంలో ఈ ఉద్యమం మరింత విస్తృతమవుతుందని
BCY పార్టీ కడప జిల్లా యూత్ కన్వినర్ కట్ల నాగార్జున యాదవ్ తెలియజేస్తున్నాను . 💪

11
3334 views

Comment